సూపర్ హీరో మూవీ సెట్స్‌కెళ్లాలంటే గొడవ తేలాలి
బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ `సూపర్ హీరో` ఫ్రాంఛైజీ ప్లాన్స్ గురించి తెలిసిందే. సల్మాన్ – కత్రిన జంటగా సూపర్ హీరో సిరీస్ కి అతడు ప్లాన్ చేస్తున్నాడు. టైగర్ జిందా హై- భారత్ లాంటి సినిమాల్ని తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్ ఈ తరహా ప్రయత్నం చేస్తుండడం సల్మాన్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా అలీ అబ్బాస్ జాఫర్ ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఫ్రాంఛైజీ గురించిన ఎన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తనదైన బ్రాండ్ తో సూపర్ హీరో యూనివర్శ్ ని సృష్టించే ప్లానింగ్ గురించి తెలిపాడు. కత్రినా కైఫ్‌తో కలిసి ఒక సూపర్ హీరో చిత్రం ప్రస్తుతం ప్లానింగులో ఉంది. ఇది వెంటనే కిక్-స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సినిమా తెరకెక్కాలంటే ముందుగా ఓ వివాదం పరిష్కృతం కావాల్సి ఉంటుంది.
మిస్టర్ ఇండియా సినిమాను జాఫర్ ఇంతకుముందు ప్రకటించగానే.. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కపూర్.. కపూర్ వారసురాలు సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అనీల్ కపూర్ నటించిన క్లాసిక్ మిస్టర్ ఇండియా రైట్స్ తమకు మాత్రమే చెందుతాయని ఆ ఇద్దరూ గొడవకు దిగారు. అయితే నేను తెరెక్కించే మిస్టర్ ఇండియా రీమేక్ లేదా రీబూట్ కాదు.. ఒరిజినల్ చిత్రం మాత్రమేనని అలీ అబ్బాస్ దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా కొత్త చిత్రం. కేవలం టైటిల్ వరకూ మాత్రమే దీనిని మిస్టర్ ఇండియా అని పిలుస్తున్నామని అలీ అబ్బాస్ జాఫర్ ముంబై మిర్రర్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
టైగర్ జిందా హై- మేరే బ్రదర్ కి దుల్హాన్ – భారత్ వంటి సినిమాల్లో జాఫర్ తో కలిసి కత్రిన పని చేసింది. అందుకే కత్రినా చిత్రంతో ప్రారంభించి సూపర్ హీరో విశ్వం సృష్టిస్తున్నానని జాఫర్ వెల్లడించారు. తన కెరీర్ లైనప్ లో చాలా ఎక్కువ సూపర్ హీరో చిత్రాలు ఉన్నాయని అతడు తెలిపారు. కత్రిన సూపర్ హీరో రోల్ తో పాటుగా మరో రెండు సూపర్ హీరో పాత్రలను అభివృద్ధి చేస్తున్నాం. నా మూడవ సూపర్ హీరో భారతీయ పురాణాల నుంచి ఎంచుకుంటుండగా.. నాలుగవది భారతీయ సైన్యం నుండి జనిస్తుంది.. అని వెల్లడించారు. అయితే అనీల్ కపూర్ – శేఖర్ కపూర్ బృందం నుంచి తొలిగా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే జాఫర్ మిస్టర్ ఇండియా కొత్త సూపర్ హీరో చిత్రాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. కపూర్ ఫ్యామిలీకి చాలా సందేహాలున్నాయి. క్లాసిక్ `మిస్టర్ ఇండియా` కథను అతడు లేపేస్తున్నాడా? అన్నదానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
No one has even asked me or mentioned to me about this film called Mr India 2. I can only guess that they using the title to get a big weekend. For they cannot use the characters/story without permission from the original creators of the film. https://t.co/Set5eDH63j
— Shekhar Kapur (@shekharkapur) February 18, 2020