‘యానిమల్‌’ నుంచి ఎమోషనల్‌ సాంగ్‌ !

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌, అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యానిమల్‌’. డిసెంబర్‌ 1న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఇక ఈ ఏడాది విడుదలైన ఆల్‌ టైమ్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలలో ‘యానిమల్‌’ కూడా చోటు సంపాదించుకుంది. అయితే ఈ మూవీలోని పాటలు ఎంత బిగ్‌ హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక్కొక్క సాంగ్‌ ఫుల్‌ వీడియోను విడుదల చేస్తున్న చిత్రబృందం తాజాగా మరో ఎమోషనల్‌ సాంగ్‌ను విడుదల చేసింది.

భావేన్‌ జానే యా నా జానే.. అంటూ సాగే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. అయితే ఈ పాట థియేటర్‌ వెర్షన్‌లో విడుదల చేయకపోగా.. తాజాగా చిత్రయూనిట్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. అనీల్‌ కపూర్‌ విూద అటాక్‌ జరిగిన అనంతరం ఈ పాట రాగా ఫుల్‌ ఎమోషనల్‌గా సాగింది. భూపిందర్‌ బబ్బల్‌ ఈ పాటను రాయడంతో పాటు పాడగా.. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించాడు.