బిగ్ ‌బాస్ 4 లో గెలుచుకున్న డ‌బ్బుల‌తో.. గంగవ్వ ఏం చేసిందంటే?

గంగవ్వ అంటే ఇప్పుడు ఒక యూట్యూబర్ కాదు. ఒక స్టార్ సెలబ్రేటి అని చెప్పవచ్చు. ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్లిందో అప్పుడే ఆమెకు అమాంతంగా క్రేజ్ పెరిగింది. గతంలో కంటే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న గంగవ్వ ఇటీవల ఒక బిగ్ బాస్ లో గెలుచుకున్న చెక్కులతో షాపింగ్ కూడా చేసింది. ఒకసారి గంగవ్వ బిగ్ బాస్ ఫ్యాషన్ షోలో సందడి చేసిన విషయం తెలిసిందే.

అయితే చాలా రోజుల తరువాత గంగవ్వకు ఆ చెక్కులు అందాయి. ఇక మొత్తానికి ఆ వాటితో షాపింగ్ చేసి బంగారం చేయించుకునేందుకు సిద్ధమైంది. ఇక బిగ్ బాస్ ద్వారా నాగార్జునకు ఇల్లు లేదని చెప్పిన గంగవ్వ ఇప్పుడు అనుకున్నట్లుగా ఇంటిని కూడా కట్టుకోబోతోంది. బిగ్ బాస్ ఆధ్వర్యంలో నాగార్జున అందించనున్న సహాయం ద్వారా గంగవ్వ ఇంటిని నిర్మాణం జరగనుందట.

ఇక ఇటీవల గంగవ్వ యూ ట్యూబ్ ఛానెల్ లో ఇంటి గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఇల్లు నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వీడియోను కూడా గంగవ్వ వీడియో ఛానెల్ ద్వారా చూపిస్తారట. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత గంగవ్వను కలిసేందుకు సెలబ్రెటీలతో పాటు జనాలు కూడా చాలా మంది ఆమె గ్రామానికి వస్తున్నారు.