బిగ్‌బాస్‌లో మరో కుట్ర.. అభిజిత్ పై వేటు వేసేందుకే..

abijeet started smart game again

తెలుగు టెలివిజన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా దూసుకుపోతోందని ప్రమోషన్స్ అయితే బాగానే చేస్తున్నారు. కానీ ఇంకా అనుకున్నంత రేంజ్ లో అయితే రేటింగ్స్ రావడం లేదు. కోట్లాది మంది విక్షిస్తున్నారని నాగార్జున ఓ వైపు ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. కానీ టాప్ 5 రేటింగ్స్ లలో కూడా స్థానం సంపాదించడం లేదని మరోవైపు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.

Bigg Boss 4 Telugu week 13 Ariyana kisses Sohel

అసలు మ్యాటర్ లోకి వస్తే అబిజిత్ పై వేటు వేసేందుకు కుట్ర జరుగుతోందని కామెంట్స్ కూడా ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. షో వ్యవహారం చూస్తే కూడా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. అభికి ఇప్పటివరకు ఎవరు పోటీ లేరని నెటిజన్లు భారీ స్థాయిలో మద్దతు ఇస్తుంటే బిగ్ బాస్ లో స్క్రీన్ టైమింగ్ లో తేడా కొట్టేస్తోంది. ఇటీవల అరియానా, సోహెల్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టడం వెనుక కొన్ని అనుమానాలు ఎక్కువవుతున్నాయి. అభిజిత్ మహారాజా టాస్క్ చేస్తున్నప్పుడు కొన్ని నిమిషాలు కూడా చూపించలేదు. చాలా వరకు అభి టైమింగ్ ను కట్ చేస్తున్నట్లు అనుమనాలు వస్తున్నాయి.

అరియానా అయితే ఈ మధ్య తన అరుపులతో ఓ వర్గం ఆడియెన్స్ కు చిరకైతే తెప్పిస్తోంది. మరోవైపు సోహెల్ ఎప్పటికప్పుడు తన యాటిట్యూడ్ చూపిస్తూ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక హారికను టాస్క్ లో ఇరికించి ఆమెకు ఓట్లు పడకుండా అరియానా ట్రిక్స్ ప్లే చేస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. మంగళవారం ఎపిసోడ్ లో మోనాల్ పై అరియానా అనేక రకాల అనుమానాలు కూడా క్రియేట్ చేసింది. పైగా కెమెరా ముందుకు వచ్చి ఒక అమ్మాయి బిగ్ బాస్ విన్నర్ అవుతుందని అనుకుంటున్నాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. ఏదేమైనా అభిజిత్ రానున్న ఎలిమినేషన్ లో పెద్ద ముప్పుని ఎదుర్కొనబోతున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.