బిగ్ బ్రేకింగ్ : టాలీవుడ్ నటుడు, నిర్మాత రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత.!

తెల్లవారుతూనే టాలీవుడ్ సినిమా ఊహించని షాక్ కి లోనయ్యింది అని చెప్పాలి. తెలుగు సినిమాకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు అలాగే నిర్మాత అలాగే మాజీ ఎంపీ అయినటువంటి రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణించారు అన్న నమ్మలేని వార్త ఇప్పుడు బయటకి వచ్చింది.

అయితే నిన్న రాత్రి నుంచే తనకి సంబంధించి కొన్ని వార్తలు బయటకి వచ్చాయి. మరి ఇంకా కొన్ని డీటెయిల్స్ లోకి వెళ్లినట్టు అయితే గత కొన్నాళ్ల నుంచి కృష్ణం రాజు వయసు సంబంధిత రీత్యా సమస్యలతో బాధ పడుతున్నారు. దీనితో కొద్దిగా ఆరోగ్యం పర్వాలేదనిపించినా బయటకి మాత్రం తనలో మార్పులు చాలా కనిపించాయి.

మరి ఇప్పుడు అనుకోని రీతిలో తాను మరణించారన్న బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నిన్న రాత్రి మూడున్నర సమయంలో హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తాను తన 83ఏళ్ల వయసులో కన్ను మూశారట. దీనితో టాలీవుడ్ లో ఊహించని విషాదం ఈరోజు నెలకొంది.

మరి తాను తన కెరీర్ లో ఎన్నో భారీ హిట్లు భారీ మల్టీ స్టారర్ లు కూడా చేశారు. అలాగే తన కెరీర్ లో విలన్ లో ఎన్నో సినిమాలు చేసి తర్వాత హీరోగా మారి మళ్ళీ తన సొంత బ్యానర్ గోపి కృష్ణ సినిమాస్ స్టార్ట్ చేసి అందులో కూడా సెన్సేషనల్ హిట్స్ ని తాను అందుకున్నారు.

అలా క్రమంగా రాజకీయాల్లోకి తాను వచ్చి అందులో కూడా సక్సెస్ అయ్యారు. మరి అలా ఇప్పుడు పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో కూడా కనిపించి చివరి సారిగా తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ లో కనిపించారు. మరి ఇప్పుడు అయితే తన అకాల మరణం టాలీవుడ్ లో ఒక తీరని లోటు కాగా వీరి అభిమానులని అయితే ఇప్పుడు శోక సంద్రంలోకి నెట్టేసింది.