బిగబాస్ 3 లో శివజ్యోతి కోసం అభిమాని ముచ్చట !

నిన్నటి బిగ్ బాస్ లో ఎపిసోడ్ లో వరుణ్, వితిక, పునర్నవి మాట్లాడుకుంటున్నప్పుడు.. పునర్నవి శివ జ్యోతిని చాలా తక్కువ చేసి మాట్లాడింది. అమ్మలక్కల ముచ్చట్లు, వాళ్ళు గ్రామీణ నేపథ్యం అని తక్కువ చేసి మాట్లాడింది. హలో పునర్నవి…
అమ్మలక్కల ముచ్చట్లా…
ఏం మాట్లాడుతున్నవ్..????
అయినా లేవగానే పెదాలకు లిప్ స్టిక్ పూసుకొని నవ్వే నీ ప్లాస్టిక్ నవ్వుకు ఏం తెలుసు అమ్మలక్కల ముచ్చట్ల మాధుర్యం..
జీవితాన్ని, అనుభవాన్ని రంగరించి ముచ్చట్ల రూపంలో మాట్లాడుకునే మాటల్లో ఎన్నో పాఠాలుంటయి..
ఏడుపు గురించి నువు మాట్లాడిన మాటలు ఒకసారి పునశ్చరణ చేసుకో.. పునర్నవి!
ఏడుపు ఒక ఎమోషన్.
బాధ, సంతోషం, కోపం ఇలా ఏ ఫీలింగ్ వచ్చినా..
పక్కన అర్థం చేసుకునే వాళ్లు, పంచుకునే వాళ్లు ఉంటే ఆ ఫీలింగ్ ఏడుపు రూపంలో బయటకు వస్తది..
ఈ విషయం కూడా తెలియదా నీకు?
పల్లెటూరు అని తక్కువ చేసి మాట్లాడినవ్ చూడు.. అది చాలా తప్పు.
పట్నం ఐదువేళ్లతో అన్నం తింటున్నదంటే పల్లెటూరి వల్లనే.
పల్లెటూరు లేకపోతే ఎవరూ ఒక్కక్షణం కూడా ఉండలేరు.
బయటకు చెప్పకపోయినా పర్వాలేదు..
కానీ.. ఒక్కసారి నీ మనసులో అయినా పల్లెటూరికి, భావాలకు, అమ్మలక్కలకు క్షమాపణలు చెప్పుకో..
ఇది ఇంకోసారి రిపీట్ అయితే..
రియాక్షన్ ఎట్లుంటదో ఊహించలేవు.. తట్టుకోలేవు. ఇట్లు
శివ జ్యోతి(సావిత్రి) అభిమాని