న్యూస్ రీడర్ వి కిడ్నీ, లివర్ కి తేడా తెలియకపోవడం ఏంటి జ్యోతక్క.. శివ జ్యోతి పై భారీ ట్రోల్స్!

జ్యోతక్క అలియాస్ శివ జ్యోతి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలంగాణ యాసలో కట్టు బొట్టుతో తీన్మార్ వార్తల ద్వారా ఎంతో సుపరిచితమైన శివ జ్యోతి తెలంగాణ యాసలో మాట్లాడుతూ విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఈమెకు వచ్చిన పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న శివజ్యోతి ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోవైపు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా గత నెల రోజుల క్రితం రంజాన్ పండుగ సందర్భంగా పిస్తా హౌస్‌ రెస్టారెంట్‌ ప్రకటించిన అన్‌లిమిటెడ్‌ బఫెట్‌ గురించి చెప్పింది. ఈ క్రమంలోనే ఈ వీడియోలో రెస్టారెంట్లో ఉన్న వంటకాల గురించి తెలియజేశారు.

ఇలా ప్రతి ఒక్క వంటకాన్ని చూపిస్తూ వాటి గురించి తెలియజేస్తూ ఉన్న శివ జ్యోతి మటన్ లివర్ దగ్గరకు రాగానే ఇది కిడ్నీ కదా.. కిడ్నీ అంటే గలీజ్ గా ఉంటుంది అంటూ మటన్ లివర్ అని చెప్పుకొచ్చారు. పక్కనే ఉన్నటువంటి తన భర్త లివర్ వేరు కిడ్నీ వేరు అంటూ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు శివజ్యోతి పై భారీ స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు శివజ్యోతి ఏకంగా న్యూస్ రీడర్ అయ్యుండి కూడా లివర్ కి, కిడ్నీకి తేడా తెలియక పోతే ఎలా జ్యోతక్క అంటూ కామెంట్ చేస్తున్నారు.