బిగ్ బాస్ 4 : మోనాల్ ఎలిమినేట్ !

బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే వైపు సాగే కొద్ది మరింత ఆసక్తిగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం 13వ వారం ముగింపుకు చేరుకుంది. ఈ వారంలో నామినేషన్స్ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు.

అభిజిత్ అఖిల్ హారిక అవినాష్ మోనాల్ 13వ వారం ఇంటి నుండి బయటకు వెళ్లి పోవడానికి నామినేట్ అయ్యారు. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత .. చాలామంది కూడా ఈ వారం మోనాల్ లేదా అవినాష్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేస్తారని చర్చలు జరిపారు.

అలాగే, పలు అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో కూడా మోనాల్ అవినాష్ చివరి రెండు స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు. అయితే అందరూ ఊహించినట్టుగానే .. 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి గుజరాతి భామ మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిందట. మోనాల్ ఎలిమినేట్ అయ్యి సహస్ర తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ షోలో అత్యంత కీలకమైన ఘట్టం ఎలిమినేషన్.

లీక్ వీరులు ఎలిమినేషన్ పై ఉండే సస్పెన్స్ ని ముందే తొలగిస్తున్న డంతో బిగ్ బాస్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రతి వారం ఎలిమినేట్ అయిన బయటకు వచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఒక రోజు ముందుగానే తెలిసిపోతుంది. ఏదేమైనా ఒక వారం అయినా ఉంటుందా లేదా అనుకున్న మోనాల్ తెలుగు రాకపోయినా.. 13 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో తన ప్రయాణాన్ని కొనసాగించి ఫైనల్ కి మరో అడుగు దూరంలో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది.