జాతీయ ఉత్త‌మ చిత్ర ద‌ర్శ‌కుడి ప‌రిస్థితి విష‌మం

జాతీయ అవార్డ్ మూవీతో పాపుల‌రైన‌‌ ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత నిషికాంత్ కామత్ ఆరోగ్య‌ పరిస్థితి విషమంగా ఉందని స‌మాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం..ఆయ‌న‌ను హైదరాబాద్‌లోని ఓ ప్ర‌యివేట్ ఆసుపత్రిలో చేర్చారు. దర్శక నటుడు కం నిర్మాత అయిన నిషికాంత్ చాలా కాలంగా కాలేయ సిరోసిస్ వ్యాధి‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు అది తిరిగబెట్టింద‌ని తెలుస్తోంది. పరిస్థితి విషమంగా మార‌డంతో నేడు ఆసుపత్రికి తరలించారు.

2005 లో మరాఠీ చిత్రం `డొంబివాలి ఫాస్ట్`కి  నిషికాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆ ఏడాదిలో అతిపెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ఒక‌టిగా నిలవ‌డ‌మే గాక‌.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2006 లో మరాఠీలో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

మాదారీ, ముంబై మేరీ జాన్, ఫోర్స్, దృశ్యం, రాకీ హ్యాండ్సమ్ స‌హా మరిన్ని చిత్రాలతో అత‌డి పేరు మార్మోగింది. సాచ్యా ఆత్ ఘరత్ (మరాఠీ), రాకీ హ్యాండ్సమ్ (2016), భావేష్ జోషి సూపర్ హీరో, ఫుగే , జూలీ 2 చిత్రాలలో నిషికాంత్ నటించారు. ఇటీవ‌ల టాలీవుడ్ లో ఓ ఇద్ద‌రు నిర్మాత‌ల‌కు గుండె పోటు వ‌చ్చిన సంగ‌తి విధిత‌మే. ఏడాది కాలంగా బాలీవుడ్ లో ప‌లువురి మ‌ర‌ణాలు బాధాక‌రం. ఇప్పుడు క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డం ఆందోళ‌న‌ను పెంచుతోంది.