Rana Daggubati: టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి గురించి మనందరికీ తెలిసిందే. రానా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ అలాగే పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. బాహుబలి లాంటి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో మరొకవైపు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తున్నారు రానా. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో సినిమాల విషయంలో కష్ట స్పీడ్ తగ్గించేశారు. ఇకపోతే రానా తాజాగా ఒక వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా వెబ్ సిరీస్ గా తెరకెక్కిన రానా నాయుడు సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది.
ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ కూడా నటించారు. ఇక ఇప్పుడు రానా నాయుడు 2 రాబోతోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల కానున్న సందర్భంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే రానా ముంబై కి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే.. రానా ముంబై ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్తుండగా కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆయన వెంటపడ్డారు. రానాను ఫోటోలు తీసేందుకు ఆయనను వెంబడించారు. ఈ క్రమంలోనే ఒక యువతి రానాకు డాష్ ఇచ్చింది.
దాంతో ఆయన చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. దాంతో రానాకు కోపం రావడంతో.. తనను వెంబడిస్తున్న ఫోటో గ్రాఫర్స్ దగ్గరకు వెళ్లి.. ఎందుకు నన్ను ఫోటోలు తీస్తున్నారు. నాకు ఇవి ఇష్టం ఉండదు.. నేను మిమ్మల్ని పిలవలేదు కదా.. పిలిచినా వారి దగ్గరకు వెళ్లి ఫోటోలు తీయండి అంటూ సున్నితంగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై రానా క్లారిటీ కూడా ఇచ్చారు. నాకు ఇలాంటివి నచ్చవు.. నాకంటూ పర్సనల్ టైమ్ ఉంటుంది. ఆ టైం లో నన్ను డిస్ట్రబ్ చేస్తే నాకు నచ్చదు. నన్ను వచ్చి ఫోటోలు తీయండి అని నేను ఎవ్వరిని పిలవను ఇదే విషయాన్నీ చాలా సందర్భాల్లో చెప్పను కూడా, అయినా వారు వినడం లేదు.. ఇది ఒకింత ఇబ్బందికి గురిచేస్తుంది. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ నన్ను చుట్టుముట్టారు. వాళ్ల నుంచి నేను తప్పించుకునే తొందర్లో ఒక అమ్మాయికి నాకు డాష్ ఇచ్చింది. దాంతో నా ఫోన్ కింద పడిపోయింది. మిమ్మల్ని పిలిచినా వారికి ఫోటోలు తీయండి తప్పులేదు అంటూ రానా వివరించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.