బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ అనేది పడలేదు. అయితే తనకు హిందీలో పెద్ద మార్కెట్ ఉందని అంటున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. తన తాజా చిత్రం సీత ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ..”నాకు హిందీలో చాలా మంచి మార్కెట్ ఉంది. అందుకే నేను హిందీ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకుని సినిమాలు చేస్తూంటాను. కవచం సినిమా హిందీ డబ్బింగ్ యూట్యూబ్ లో పెడితే మిలియన్ వ్యూస్ వచ్చాయి. అల్లు అర్జున్ తర్వాత నా సినిమాలకే అక్కడ మంచి మార్కెట్ ఉంది. నాకు అలాంటి మార్కెట్ ఇచ్చినందుకు నేను గర్వపడుతూంటాను ,” అని చెప్పుకొచ్చారు.
తేజ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. వీరిద్దరూ జంటగా నటించడం ఇది రెండోసారి. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించారు.
‘RX 100’ భామ పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇటీవల విడులైన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను ఈనెల 24న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో మన్నారా చోప్రా, తనికెళ్ల భరణి, అభినవ్ గోమటం, అభిమన్యుసింగ్ ముఖ్య పాత్రలు పోషించారు.