బెల్లంకొండ‘రాక్షసుడు’ ఫస్ట్ లుక్

సినిమా హిట్టా..ఫ్లాఫా అనే రిజల్ట్ తో సంబంధం లేకుండా.. వరుసగా చిత్రాలను చేస్తున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. రీసెంట్ గా కవచం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ హీరో.. సీత చిత్రంలో త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. తాదాగా ఈ హీరో ఓ రీమేక్‌ చిత్రం కూడా కమిటయ్యాడు.

తమిళ హిట్‌ మూవీ రాక్షసన్‌ను.. తెలుగులో రాక్షసుడుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ కూడా శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను ఈ రోజు విడుదల చేసింది చిత్రయూనిట్‌.

ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. సైకో కిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరణ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రైడ్‌, వీర ఫేమ్‌ రమేష్‌ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

షూటింగ్ ఇప్పటికే దాదాపు 60 శాతం పూర్తయింది. ఉగాది సంద‌ర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో బెల్లంకొండ శీను, అనుప‌మ షాక్‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. సైకో కిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.