భీష్మ మొదటి లుక్ ఇది

వరుస ఫ్లాపులతో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు చలో సినిమాకు పరిచయమైన దర్శకుడు వెంకీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు లాంగ్ గ్యాప్‌ తరువాత ఇటీవల తిరిగి షూటింగ్ ప్రారంభించిన నితిన్‌ భీష్మ పనుల్లో బిజీగా ఉన్నాడు.

తాజాగా ఈ సినిమాలో నితిన్‌ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా డీసెంట్‌ లుక్‌లో దర్శనమిస్తున్నాడు నితిన్‌. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు.ఈ సినిమాతో నితిన్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్‌దేతో పాటు చంద్ర శేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాను చేసేందుకు అంగీకరించారు.