ఈ యువ హీరోస్ కి బండ్ల గణేష్ క్లాస్..పవన్ ని చూసి నేర్చుకోవాలి అంటూ.!

తెలుగు సినిమా దగ్గర ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే పవన్ ఎంత స్టార్డం ఉన్నా కూడా చాలా ఒదిగే ఉంటాడని అందరికీ తెలిసిందే. మరి తనకి ఉన్న ఎందరో ఫ్యాన్స్ లో మన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అలాగే నటుడు బండ్ల గణేష్ కూడా ఒకరు.

అయితే బండ్ల గణేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన దేవర పవన్ కళ్యాణ్ జపం చేస్తూనే ఉంటాడు. కానీ ఈసారి తన అభిమానంతో కాస్త అతి చేసినట్టే అనిపిస్తుంది. పవన్ అభిమానులు కూడా బండ్ల గణేష్ చేసిన లేటెస్ట్ పోస్ట్ ఒకదాని విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఆదరణ అందుకుంటున్న యువ హీరోల్లో డీజే టిల్లు ఫేమ్ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ అలాగే హీరో అడివి శేష్ లు కూడా ఒకరు. అయితే ఈ ఇద్దరు యంగ్ హీరోలు నిన్న సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు.

అయితే ఆ ఈవెంట్ లో ఈ హీరోలు తమకి నచ్చినట్టుగా కూర్చున్నారు. దీనితో ఈ ఫోటో పట్టుకొని “నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం” అంటూ పవన్ కళ్యాణ్ వి కొన్ని డీసెంట్ ఫోటోలు కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఉన్న వాటితో పోల్చి షేర్ చేశారు దీనితో ఈ పోస్ట్ కాస్తా కాస్త అతిగా మారి ఇతర పవన్ అభిమానులకి ఇబ్బందిగా మారింది.