“జల్సా” రికార్డు కొట్టేసిన “చెన్నకేశవ రెడ్డి”.!

తాజాగా టాలీవుడ్ స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ ఏ లెవెల్లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి మళ్ళీ రిలీజ్ కాగా దానిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “జల్సా” తో రిలీజ్ చేసి భారీ వసూళ్లతో బ్రేక్ చేశారు.

అయితే ఓవరాల్ వచ్చిన గ్రాస్ లో జల్సా ఇప్పటివరకు ఆల్ టైం రికార్డులో ఉంది. ఇక యూఎస్ లో అయితే జల్సా రికార్డు బాలయ్య సెన్సేషన్ లో కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. బాలయ్య నటించిన మాస్ చిత్రం “చెన్నకేశవ రెడ్డి” చిత్రం రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా యూఎస్ లో ఈ సినిమాకి మాస్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.

దీనితో అయితే జల్సా నమోదు చేసిన హైయెస్ట్ రికార్డు ని ఈ చిత్రం క్రాస్ చేసేయనున్నట్టుగా తెలుస్తుంది. జల్సా సినిమా యూఎస్ లో 35 వేల మేర డాలర్స్ అందుకోగా చెన్నకేశవ రెడ్డి ఆల్రెడీ ఒక రోజు ముందే 31 వేల డాలర్స్ ని అందుకుంది.

దీనితో ఈ చిత్రంతో జల్సా రికార్డు బద్దలు అయిపోయినట్టే అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి అయితే బాలయ్య తన మాస్ తో సెన్సేషన్ ని చూపించాడని చెప్పాల్సిందే.