బాలికా వధు సీరియల్‌తో ఉత్తరాదిని ఊపేసిన అవికా గోర్.. తెలుగు ప్రేక్షకులను చిన్నారి పెళ్లికూతురు ధారవాహికతో కట్టిపడేసింది. ఆనందిగా ఆ సీరియల్‌లో నటించి అందర్నీ మెప్పంచింది. అక్కడి నుంచి అవికా గోర్ ఉయ్యాల జంపాల చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్ని నాయన వంటి సినిమాల్లో నటించి విజయాన్ని అందుకుంది. అవికా గోర్ తాజాగా ఓ పోస్ట్ చేసింది.
నా ప్రియుడు ఇతడే కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెబుతూ ఓ పోస్ట్ చేసింది. బుల్లితెర పరిశ్రమకు చెందిన మిలింద్ చాంద్వాని గురించి చెబుతూ నా మనసు దోచేశాడు.. నాకు భాగస్వామి దొరికేశాడు అని అవికా ఓ పోస్ట్ చేసింది. నా ప్రార్థనలకు సమాధానం దొరికింది. నా లైఫ్‌లో లవ్ దొరికింది. ఇకపై ఇతడు నావాడు. నేను అతనిదాన్ని. మనల్ని అర్థం చేసుకుని, నమ్మకంగా ఉంటూ స్ఫూర్తి నింపుతూ, ఎదుగుదలకు దోహదం చేస్తూ మనల్ని కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తిని పొందాలని మనమంతా అనుకుంటాం.
కానీ అలాంటి భాగస్వామి దొరకడం అసాధ్యమని అందరూ అనుకుంటారు. కానీ నా విషయంలో మాత్రం ఇది నిజమైంది. అందుకే ఇదంతా ఇప్పటికీ కలలాగే అనిపిస్తోంది. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. నేను ఎలా ఫీల్ అవుతున్నానో అది మీ అందరు కూడా ఫీలవ్వాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ ఇడియట్ నా హృదయాన్ని కదిలించాడు. నా జీవితానికి నిండుదనం తెచ్చినందుకు థ్యాంక్స్ మిలింద్. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా అని సుధీర్ఘమైన పోస్ట్ చేసింది.