హైదరాబాద్ లో శింబు “అత్తారింటికి దారేది ” షూటింగు

తెలుగులో సూపర్ హిట్ అయిన పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది ” తెలుగు సినిమాను తమిళం లో లైకా వారు పునర్నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత్రలో శింబు నటిస్తున్నాడు . అతనికి జోడిగా మేకా  ఆకాష్ , ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని సుందర్ సి దర్శకత్వం లో నిర్మిస్తున్నారు .

ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ బేగంపేటలో ని ఓ స్టార్ హోటల్లో తీస్తున్నారు . మొదటిసారి చింబు సుందర్ కలసి పని చేస్తున్నారు .

తమిళ సినిమాలు ఈ మధ్య కాలంలో రామోజీ ఫిలిం సిటీ , లేదా హైదరాబాద్ నగరంలో షూటింగ్ చేసుకుంటున్నాయి . చెన్నై  కన్నా హైదరాబాద్ అయితేనే షూటింగ్ సాఫీగా జరుగుతుందని , చెన్నై లో స్టార్స్ తో షూటింగ్ చెయ్యలేని పరిస్థితిని నిర్మాతలు చెబుతున్నారు .

మరికొన్ని రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది . వచ్చే సంవత్సరం జనవరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం వుంది .