కొన్ని రిలేషన్స్ వింటూంటే ఆశ్చర్యంగా ఉంటుంది..నిజమా అనే సందేహం వస్తూంది. అయితే కళ్లారా చూసాక ఇదేం పాడు బుద్ది అనిపిస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ వ్యవహారం అలాగే ఉంది. ఈ కుర్రాడు గత కొంతకాలంగా బాలీవుడ్ ము దురు భామ మలైకా అరోరా వెనకపడుతున్నాడు. అఫ్ కోర్స్…ఆమె కూడా ఈ కుర్రాడే వెనకే ఉంటోంది ఎప్పుడూ. అయితే మేము ఇద్దరం కేవలం ఫ్రెండ్స్ మి అంటూ ఖండనలు చేసినా అర్దరాత్రిళ్లు వీళ్లిద్దరు కలిసి తిరగటం మాత్రం కొట్టిపారేయలేని పరిస్దితి క్రియేట్ చేసింది.
ఆ మధ్యన ఇది హెడ్ లైన్స్ కు ఎక్కింది. అంతకు ముందు అయితే సల్మాన్ ఖాన్ సీరియస్ గా తీసుకునేవాడేమో కానీ ..తన సోదరుడు అర్బాజ్ ఖాన్ ..కు మలైకాకు మధ్య డైవర్స్ కావటంతో ఆ సంగతి పట్టించుకోవటం లేదు. కానీ మీడియా ఊరుకుంటుందా. ఆ ఫొటోలు,వీడియోలతో హల్ చల్ చేసి పండుగ చేసుకుంది. ఆ సంగతి అందరు మర్చిపోయారు. మళ్లీ ఇంతకాలానికి వాళ్లిద్దరు అర్దరాత్రి పార్టికి హాజరయ్యి మీడియా కళ్లలో
పడ్డారు.
అయితే మీడియా తమని వాచ్ చేస్తుందని వీళ్లకు తెలియదా…అలాంటప్పుడు వీళ్లు ఇలా కలిసి తిరగటంలో ఆంతర్యం ఏమిటి…కావాలనే కెమెరా కళ్లల్లో పడటానికి ఇలా చేస్తున్నారా అనే సందేహం వెల్లబుచ్చుతున్నారు కొందరు. వాళ్లు కావాలని చేసినా, మీడియా కావాలని హైలెట్ చేసినా మాకు ఫైనల్ గా దక్కేది ఆనందమేగా అని ఈ ఫొటోలతో తమకు తోచినట్లు కథలు అల్లేసుకుంటున్నారు. ఏదైనా కుర్ర హీరోకు ఈ ముదురు ఆంటీ
అంటే మోజు తీరలేదని అర్దం అవుతోంది కదూ.