అరవింద సమేత కలిపింది ఆ ఇద్దరినీ

నందమూరి అభిమానులు ,తెలుగు సినిమా రంగ ప్రముఖులు ఎదురు చూస్తున్న ఆ అమృత ఘడియలు వచ్చేశాయి . ఆదివారం రాత్రి జరిగిన అరవింద సమేత వీర రాఘవ చిత్ర విజయోత్సవ వేడుక దీనికి వేదికయ్యింది . బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కలుసుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడంతో కార్యక్రమానికి హాజరైన అభిమానులు హర్షద్వానాలు చేశారు . ఈ దృశ్యం మనోహరంగా కనిపించింది .

 

బాలకృష్ణ ఈ సినిమావిజయోత్సవానికి  ముఖ్య అతిధిగా వచ్చారు . బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ భుజాల మీద చేతులు వేసి ఫొటోకు పోజ్ ఇచ్చారు . ఈ ఘటనకు జూనియర్  ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కళ్ళల్లో ఆనంద భాష్పాలు  కనిపించాయి . కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు తమ తండ్రి హరి కృష్ణ ను బాలకృష్ణ లో చూసుకుంటామని చెప్పడం విశేషం .