“ఆక్వామెన్” తెలుగు వెర్షన్ ట్రైలర్..చూసారా?

తెలుగులోను హాలీవుడ్ చిత్రాలు పెద్ద సంఖ్యలో విడుదల అవుతున్నాయి. అలా తెరపైకి దూసుకొచ్చిన ఎన్నో హాలీవుడ్ చిత్రాలు సూపర్ హిట్స్ అందుకున్నాయి. తాజాగా ‘ఆక్వామేన్ అనే హాలీవుడ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. జేమ్స్ మామ్ .. అంబర్ హియర్డ్ .. పాట్రిక్ విల్సన్ తదితరులు నటించిన ఈ సినిమాకి, జేమ్స్ వాన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  అద్భుతమైన విజువల్స్ తో ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సముద్రం నేపథ్యంలో సాగే కథ ఆశ్చర్యచకితులను చేస్తోంది.

ఆక్వామన్‌ పుట్టుక, పెద్దవాడయ్యే కొద్ది అతనిలో కలిగే విచిత్రమైన మార్పులు, ఆక్వామన్‌గా మారడం వెనకున్న కారణాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఆంబర్‌ హర్డ్‌, ప్యాట్రిక్‌ విల్సన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం ఇదివరకు ఎవ్వరూ చూడని ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు గతంలో దర్శకుడు జేమ్స్‌ వాన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Aquaman - 'Final Trailer Telugu'

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 21న విడుదల కాబోతోంది. అయితే అమెజాన్‌ ప్రైమ్‌లో సభ్యత్వం ఉన్నవారు ఈ చిత్రాన్ని విడుదలకు వారం ముందుగానే చూడవచ్చు. ఆటం టికెట్స్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఒక్కొక్కరూ పది టికెట్ల వరకు కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని చిత్ర యూనిట్ కల్పిస్తోంది.

ఆ టికెట్లతో భారతదేశంలోని ఏ థియేటర్‌లోనైనా ‘అక్వామన్‌’ చిత్రాన్ని చూసే అవకాశం ఉంది. గతంలోనూ అమెజాన్‌ ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించింది. ‘జుమాంజీ’ సినిమా విడుదల కావడానికి 12రోజుల ముందే ప్రైమ్‌ సభ్వత్వం ఉన్నవారికి ఈ చిత్రాన్ని చూసే అవకాశం కల్పించింది.