అందాల భామలు కేవలం నటనకే పరిమితం కావడం లేదు. తమలోని సకల కళల్ని బయటకు
తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది నిర్మాణ రంగం వైపు అడుగుపెట్టాలని చూస్తుంటే, ఇంకొందరు సృజనాత్మక రంగంలోనే ప్రయతించడానికి సన్నద్ధమవుతున్నారు. బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ కూడా తనలోని కొత్త ప్రతిభను వెలుగు చూపించడానికి తహ తహలాడుతుంది. తనలో దాగి ఉన్న మరో కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటోంది. త్వరలోనే దర్శకురాలిగా అవతారం ఎత్తలనుకుంటోంది.
అనుపమాకు దర్శకత్వం అంటే ప్రాణం. ఖాళీ సమయాల్లో హిందీ, దక్షిణాది సినిమాలను చూస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రతిభను చాటడానికి కొంత సమయం ఉందట! తెలుగు, తమిళ భాషల్లో స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయంటోంది. కథానాయికగా మంచి టాలెంట్ ను చూపించిన అనుపమా పరమేశ్వరన్ లోని కొత్తకోణాన్ని త్వరలోనే చూడొచ్చన్నమాట!