టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చింది ఎన్ ఆర్ ఐ భామ అను ఇమ్మాన్యుయేల్. కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే చిన్న సినిమాతో పరిచయమైన అమ్మడు అందంతో అటుపై బడా ఛాన్సులే అందుకుంది. మజ్ను, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య లాంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది. కానీ అందులో ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. దీంతో ఖాళీ అయిపోయింది. ఏడాదిన్నరగా ఖాళీగానే ఉంటుంది. చివరిగా శైలజా రెడ్డి అల్లుడు లో నటించింది. అదీ అమ్మడికి పేరు తీసుకురాలేదు. దీంతో సొగసరి కోలీవుడ్ లోనైనా రాణించాలని ప్రయత్నించింది. అక్కడా నత్త నడకనే కెరీర్ సాగుతోంది.
ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లుడు అదుర్స్ లో ఛాన్స్ అందుకుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. లేదంటే ఇప్పటికే సినిమా సెట్స్ కు వెళ్లాల్సింది. తాజాగా అమ్మడు ఓ తమిళ్ లైవ్ ఇంటర్వూలో వింత ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు అంతే ధీటుగా బధులిచ్చి ఆకతాయిల నోళ్లు మూయించింది. అంతగా అడగకూడని ప్రశ్న ఏమని అంటే? మీరు చూడటానికి పోర్న్ స్టార్ లా ఉంటారు? అసలు మీ నేపథ్యం ఏంటని సూటిగా అడిగేసాడు. దీంతో అమ్మడు అసహనానికి గురై మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు.
పోర్న్ స్టార్..రెన్ స్టార్… డ్రాగన్ స్టార్ ఇలా నన్ను ఎలా చూసినా పర్వాలేదు. వాళ్లు మనుషులే…నేను మనిషినే. ఎవరి వృత్తి వాళ్లది. ఎవరి జీవితం వాళ్లది. మనమంతా మనిషి జాతే అన్న విషయాన్ని మర్చిపోకుండా ఉంటే చాలు అంటూ ఆ ఆకతాయికి కౌంటర్ వేసింది. కించపరిచే సమాజం…మనుషులు ఉన్నంత కాలం ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడమే అంటూ బధులించ్చింది.