ఎమ్మెస్ రెడ్డి కలలు కన్న”అందం “

నిర్మాత ఎమ్మెస్ రెడ్డి తెలుగు సినిమా రంగంలో నికార్సైన మనిషిగా పేరుంది . ఆయన కవి రచయిత కూడా. కాలేజీ అంటే తెలియని ఎమ్మెస్ రెడ్డిపైకి లోక జ్ఞానం తో పాటు సాహిత్యాభిలాష కూడా ఎక్కువే. సాహిత్యమంటే ఆయన ప్రాణం ఇస్తారు . తన స్వంత సినిమాలకే కాదు బయటి వాటికి కూడా అనేక భావ యుక్తమైన పాటలను రాశారు . ఆయన అనేక పద్య కావ్యాలను కూడా రచించారు . రామాయణ కావ్యాన్ని రాసి ఎమ్మెస్ రెడ్డి జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు .” కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు ” అన్న నానుడిని నిజం చేసిన వ్యక్తి ఎమ్మెస్ . అయితే ఆయన ఇష్టపడి నిర్మించిన ఓ దృశ్య కావ్యం విడుదలను నోసుకోలేదు అంటే అందరికీ ఆశ్యర్యంగా ఉంటుంది . ఇది నిజం . 

శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆయన “అందం ” అనే సినిమా నిర్మించాడు . దీనికి చక్కటి సంభాషణలతో పాటు మంచి ప్రణయ గీతాలను కూడా వ్రాశారు . కానీ ఆర్ధిక కారణాలతో ఈ సినిమా విడుదల కాలేదు . ఈ సినిమాలో రాహుల్ అనే యువకుడును కథానాయకుడుగా  సహన అనే అమ్మాయిని నాయికాగా ఎంపిక చేశారు . ఈ ఇద్దరు తాను అనుకున్నట్టు ప్రతిభావాంతంగా నటించారని ఎంఎస్ రెడ్డి చెప్పేవారు . ఆనాటి రాహుల్ ఈనాటి బుల్లితెర కౌశిక్ , ఇక అప్పటి హీరోయిన్ నేటి బాబు గోగినేని భార్య. ఎంఎస్ రెడ్డి కలలు కన్న “