అర్దరాత్రి లేడీ యాంకర్ ఇంట్లో రచ్చ చేసిన రవి!

Anchor Ravi Nuvvu Ready Nenu Ready Success Celebration

ప్రస్తుతం బుల్లితెరపై మేల్ యాంకరింగ్‌లో ప్రదీప్, రవి దుమ్ములేపుతున్నారు. పటాస్ షోతో యాంకరింగ్ ‌లో పీక్స్ చేరుకున్న రవి.. ఇప్పుడు అదిరిందిలో మరింత రెచ్చిపోతున్నాడు. డబుల్ మీనింగ్, మసాలా కంటెంట్, సెటైర్లలో రవిని మించిన వారెవ్వరూ లేరు. యాంకర్ రవి సెటైర్లు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంటాయి. అయితే రవి ఎప్పుడూ చూసిన తన పక్కన ఓ లేడీ యాంకర్‌ను పెట్టుకుంటూనే ఉంటాడు.

Anchor Ravi Nuvvu Ready Nenu Ready Success Celebration
Anchor Ravi Nuvvu Ready Nenu Ready Success Celebration

స్టార్ మా మ్యూజిక్‌లో సమ్ థింగ్ స్పెషల్‌తో లాస్యతో మొదలుపెట్టిన రవి.. పటాస్ షోలో శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ వరకు వచ్చాడు. ఈ మధ్య అదిరిందిలో భాను శ్రీతో కలిసి దుమ్ములేపుతున్నాడు. ఇక తాజాగా వింధ్య మేడపాటి అనే కొత్త యాంకర్‌తొ ఈటీవీలో నువ్వు రెడీ నేను రెడీ అనే షోను చేస్తున్నాడు. గత వారం మొదలైన ఈ షో బాగానే క్లిక్కియినట్టుంది. షో సక్సెస్ కావడంతో అందరూ బాగా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.

షో సక్సెస్ అయినందుకు సెలెబ్రేట్ చేసుకున్నామని చెబుతూ.. యాంకర్ రవి ఓ వీడియోను షేర్ చేశాడు. రాత్రి పూట యాంకర్ వింధ్య ఇంటికి అందరూ చేరుకున్నట్టు, అందరూ డ్యాన్సులతో ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. కేక్ కటింగ్, రుచికరమైన వింధు భోజనం చేసి దుమ్ములేపినట్టు తెలుస్తోంది. షోను హిట్టు చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పాడు యాంకర్ రవి.