లేడీ యాంకర్ కాళ్లు పట్టుకున్న రవి!!

Anchor Ravi ANd Vindhya Medapati Romance In Nuvvu Ready Nenu Ready

యాంకర్ రవి బుల్లితెరపై పండించే రొమాన్స్, లేడీ యాంకర్స్‌తో నడిపించే కెమిస్ట్రీ, వేసే పంచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టినప్పటి నుంచీ పక్కన ఎవరో ఒకరు లేడీ యాంకర్ ఉండాల్సిందే. అలా రవి పక్కన లాస్య, శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ, భాను వంటి వారు సక్సెస్ ఫుల్ పెయిర్‌గా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు యాంకర్ రవి కొత్త షోతో ముందుకు వచ్చాడు.

Anchor Ravi ANd Vindhya Medapati Romance In Nuvvu Ready Nenu Ready
Anchor Ravi ANd Vindhya Medapati In Nuvvu Ready Nenu Ready

భార్య భర్తల సరదాలు, గొడవల, సరసాలను చూపించేందుకు నువ్వు రెడీ నేను రెడీ అంటూ లేడీ యాంకర్ వింధ్యతో కలిసి వచ్చాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్‌లు ప్రసారం అయ్యాయి. వాటి ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఒకటి మరింతగా వైరల్ అవుతోంది. ఇందులో లేడీ యాంకర్‌కు రవి చేసిన సేవలు చూస్తే మతిపోవాల్సిందే.

సీతయ్య సినిమాలో సమయానికి తగు సేవలు అనే పాట ఉంది కదా. ఆ పాటలో రవి, వింధ్య జీవించారు. రవి అయితే ఏకంగా వింధ్య పాదాలు పట్టుకున్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్లి కాళ్లు కూడా నొక్కాడం వంటివి చేశాడు. ఇక వీరిద్దరి పర్ఫామెన్స్‌కు నెటిజన్స్ ఫిదా అయ్యారు. మొత్తానికి కొత్తగా ప్రారంభించిన ఈ షో వీరిద్దరి కెమిస్ట్రీతో బాగానే నడుస్తోంది.