టాప్ సీక్రెట్స్ అన్నిటినీ బ‌య‌ట‌పెట్టిన అన‌సూయ‌

టాలీవుడ్ టాప్ యాంక‌ర్ల‌లో అద్భుత‌మైన ఫాలోయింగ్ ఉన్న యాంక‌ర్ అన‌సూయ‌. పెద్ద తెర‌పై మెరుస్తూనే బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తుంది. పెళ్ల‌యి బిడ్డ‌కు త‌ల్లి అయినా త‌న రేంజును పెంచుకుంటూ వెళుతోందే కానీ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఇంత‌కుముందు రంగ‌స్థ‌లం రంగ‌మ్మ‌త్త‌గా మెరిసింది. ఇప్ప‌టికిప్పుడు బ‌న్ని – సుక్కూ సినిమాలో మ‌రో ఛాలెంజింగ్ రోల్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. తాజాగా `ఆస్క్ అనసూయ` అంటూ ట్విట్టర్లో సరదాగా ట‌చ్ లోకి వ‌చ్చింది. ఆన్ లైన్ లో ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు అన‌సూయ‌ సమాధానం ఇచ్చింది.

*మీ మొదటి జీతంతో ఏమి చేశారు ?
మా అమ్మకి ఒక బంగారపు ఉంగరాన్ని కొన్నాను.

*జిమ్ లో మీరు రోజూ ఎంత సమయం గడుపుతారు?
అసలు గడపను

*మీరు నటించిన సినిమాల్లో మీరు ఛాలెంజ్ అనుకుని చేసిన రోల్ ఏది?
ఇప్పటివరకూ నేను ఛాలెంజ్ రోల్ ఏది చేయలేదు, నాకు అలాంటి రోల్ కూడా రాలేదు.

*మీ జీవితాన్ని ఒకే మాటలో వివరించమంటే ?’..
నా కోసం ఉన్న క్షణంలో నాకు నచినట్లుయిగా ఉత్తమంగా జీవించడం.

*త‌దుప‌రి సినిమాలు?
ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. లాక్ డౌన్ కారణంగా షెడ్యూల్స్ అన్ని గజిబిజిగా మారిపోయాయి. రాజీ లేకుండా అన్నిటినీ పూర్తి చేస్తాను.