అన‌సూయ వేశ్య అంటూ ప్ర‌చారం.. క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

బుల్లితెర‌పై స‌త్తా చాటుతూనే వెండితెర‌పై అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన‌ప్ప‌టికీ త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారుకు గాలం వేస్తూ వ‌రుస ఆఫ్స్ అందుకుంటుంది. గ్లామ‌ర్ డాల్‌గా పేరొందిన అన‌సూయ యాంక‌ర్‌గాను, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గాను, లీడ‌ర్ రోల్‌లోను ,స్పెష‌ల్ సాంగ్స్‌లోను ఇలా మంచి అవ‌కాశం వ‌స్తే వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది. ప్ర‌స్తుతం అన‌సూయ ఖాతాలో అర‌డ‌జనుకు పైగా సినిమా ఆఫ‌ర్స్ ఉన్నాయ‌ని తెలుస్తుండ‌గా, మారుతి- గోపిచంద్ చిత్రంలోను న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

Anasuya Bharadwaj after workout
 

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే టైటిల్‌తో మారుతి-గోపిచంద్ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ సినిమాలో అన‌సూయ పాత్ర వేశ్య అని ఆ పాత్ర‌కు ఆమె ప్రాణం పోసి న‌టిస్తుంద‌నే కార‌ణంతో మేక‌ర్స్ ఎంపిక చేశార‌ని అనేక ప్ర‌చారాలు న‌డిచాయి. ఇది ఛాలెంజింగ్ రోల్ కాబ‌ట్టి అన‌సూయ కూడా వెంట‌నే ఈ పాత్ర‌కు ఓకే చెప్పేసింద‌ని అన్నారు. అయితే ఈ వార్త తెగ హ‌ల్ చ‌ల్ చేయ‌డంతో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ డైరెక్ట‌ర్ మారుతి స్పందించారు.పక్కా కమర్షియల్ సినిమాలో అనసూయ క్యారెక్టర్ ఉంది. కానీ మీరనుకునే క్యారెక్టర్ మాత్రం కాదు అని అన్నారు.

అన‌సూయ పాత్ర మంచి వినోద‌భ‌రితంగా ఉంటుంద‌ని, మిమ్మ‌ల్ని త‌ప్ప‌క మెప్పించేలా ఉంటుంద‌ని మారుతి పేర్కొన్నారు. డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు తాళం పడింది. ఇదిలా ఉండగా అన‌సూయ ప్ర‌స్తుతం థ్యాంక్ యూ బ్ర‌దర్ అనే చిత్రం చేస్తుండ‌గా, ఇందులో లీడ్ రోల్ పోషిస్తుంది. నిండు గర్భీణి పాత్రలో గొప్ప ఛాలెంజింగ్ రోల్ కూడా చేసింది. ఇక రంగ‌మార్తాండ‌, ఖిలాడీ చిత్రాల‌లో కీలక పాత్ర పోషిస్తుంది. చావు క‌బురు చ‌ల్ల‌గా అనే చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌గా, ఈ పాట అతి త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.