HomeNewsఅన‌సూయ స‌మాధానంతో బిత్త‌ర‌పోయిన నెటిజ‌న్..!

అన‌సూయ స‌మాధానంతో బిత్త‌ర‌పోయిన నెటిజ‌న్..!

బుల్లితెర‌కు గ్లామ‌ర్ అద్దిన అందాల భామ అన‌సూయ హీరోయిన్స్ క‌న్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఒక‌వైపు టీవీ షోస్ మ‌రోవైపు సినిమాల‌తో త‌న పాపులారిటీ పెంచుకుంటూ పోతుంది. ఇక సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ‌కు అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. రెగ్యుల‌ర్‌గా ఫొటోషూట్స్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేయ‌డం, లేదంటే షూటింగ్‌కు సంబంధించిన ఫ‌న్నీ ఇన్సిడెంట్స్‌ను షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ను అల‌రిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్ర‌స్తుతం ఖిలాడీ, చావు క‌బురు చ‌ల్ల‌గా, థాంక్యూ బ్ర‌ద‌ర్, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వంటి ప‌లు ఆస‌క్తిక‌ర చిత్రాల‌తో బిజీగా ఉంది అన‌సూయ‌.

Anu 2 | Telugu Rajyam

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన‌సూయ వీలున్న‌ప్పుడ‌ల్లా అభిమానుల‌తో ఇంట‌రాక్ష‌న్ అవుతూ ఉంటుంది. అప్పుడ‌ప్పుడు వారు చేసే పిచ్చి కామెంట్స్‌కు త‌న‌దైన శైలిలో బ‌దులిస్తూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజ‌న్ అన‌సూయ ఫొటోకి కామెంట్‌గా నువ్వేమైన సమంత అని అనుకుంటున్నావా అని కామెంట్ పెట్టాడు. దీనికి త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చిన అన‌సూయ.. అయ్య‌య్యో లేద‌మ్మా నన్ను అన‌సూయ అంటారు అని బ‌దులిచ్చింది.

అన‌సూయ కామెంట్‌కు తిరిగి స‌మాధానం ఇచ్చిన స‌ద‌రు నెటిజ‌న్ .. సారీ మేడమ్.. జోక్ చేశాను, లైట్ తీసుకోండ‌ని అన్నాడు. దాంతో అన‌సూయ అత‌డికి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చింది. నీది చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం అని అర్ద‌మైంది. త్వ‌ర‌గా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను అంటూ బ‌దులిచ్చింది. ప్ర‌స్తుతం నెటిజ‌న్, అన‌సూయ మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర చర్చ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Anu1 1 | Telugu Rajyam

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News