హాట్ యాంక‌ర్ ప్యాంట్ మ‌ర్చిపోయిందా?

హాట్ యాంక‌ర్ అన‌సూయ‌- నెటిజ‌నుల మ‌ధ్య సోష‌ల్ వార్ ఎప్పుడూ కామ‌న్. అమ్మ‌డి చిలిపి ప‌నుల‌పై నెట్టింట ఆకాతాయిలు అదే రేంజ్ లో చెల‌రేగిపోతుంటారు. హాట్‌ హాట్ ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో అమ్మడు క‌వ్విస్తుంటే అందుకు త‌గ్గ‌ట్టే రెచ్చిపోవ‌డం రివాజుగా మారింది. తాజాగా మ‌రోసారి నెట్టింటి కొంటె కుర్రాళ్ల‌‌కు అడ్డంగా దొర‌కిపోయింది. లాక్ డౌన్ వేళ సెల‌బ్రిటీలంతా ఇళ్ల‌కు ప‌ర‌మిత‌మైన సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల ఛాలెంజ్ లు విసురుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. ఇంకొంత మంది‌ భామ‌ల వంట గ‌దిలో చేతివాటం చూపిస్తున్నారు.

తాజాగా అన‌సూయ కూడా అలాంటి ప్ర‌యోగమే చేసింది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే అమ్మ‌డు హాట్ హాట్ గా త‌యారై వంట గ‌దిలో ప్ర‌వేశించింది. టాప్ లో పొడ‌వాటి ష‌ర్ట్ ధ‌రించి.. బాట‌మ్ లో మాత్రం చిట్టి పొట్టి నిక్క‌రు వేసుకుంది.ఆ నిక్కరును కూడా పొడ‌వుగా ఉన్న వైట్ ష‌ర్ట్ క‌వర్ చేసేసింది. దీంతో ఆక‌తాయిలు రెచ్చిపోయారు. అన‌సూయ వంట‌లు చేసే ఉత్సాహంలో ప్యాంట్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. వీడియో లో వంట‌పై క‌న్నా త‌న గ్లామ‌ర్ ఎక్స్ ఫోజింగ్ పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింద‌ని….వంట‌లు చేసే యాంక‌ర్ కిచెన్ రూమ్ లో సెప్టే డ్రెస్ లేకుండా వెళ్లిందంటే? వ‌ంట చేయ‌డానికా? లేక ఎక్స్ ఫోజింగ్ కోస‌మా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనసూయ వీటికి అంతే ధీటుగా బ‌ధులిస్తోంది. ఎందుకో ఇన్ని తిప్ప‌లు. గ‌తంలోనూ అమ్మ‌డు ఇలా ప‌లు మార్లు విమ‌ర్శ‌ల‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఓసారి జ‌రిగిన యుద్ధానికైతే! ఏకంగా ట్విట‌ర్ కి గుడ్ బై చెప్పేస్తున్నాని ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ కొన్నాళ్ల‌కి అదే అకౌంట్ రీ ఓపేన్ చేసి య‌థా విధిగా ప‌నులు త‌న ప్ర‌మోష‌న్ ప‌నులు మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.