ప్చ్…అనసూయ దొరికిపోయింది, మామూలుగా తిట్టడం లేదుగా

రోజులు మారిపోయాయి. జనం ప్రతీ విషయం మీదా ఇమ్మీడియట్ గా సోషల్‌ మీడియా లో స్పందిస్తున్నారు. నచ్చిన దాన్ని ఎంతలా మోస్తున్నారో..నచ్చని దాన్ని అంతలా ట్రోల్ చేసేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా జనాల ఆగ్రహానికే కాక మహానటి సావిత్రి అభిమానుల ఆగ్రహానికి గురయ్యింది యాంకర్‌ అనసూయ. అనవసరంగా కెలుక్కున్నట్లు అయ్యిందే అని ఫీలయ్యేలా ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే… టీవీ షోలు.. సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోన్న అనసూయ ఈ మధ్యన యాడ్స్ లో కూడా కనిపిస్తోంది. రీసెంట్ గా ఓ షాపింగ్ మాల్ యాడ్‌లో కనిపించింది అనసూయ. ఆ యాడ్‌ కోసం సదరు షాపింగ్ మాల్ వారు..అత్యుత్సాహంతో ..ఎవర్‌ గ్రీన్‌ హిట్‌ ‘మాయాబజార్‌’ సినిమాలోని ‘ఆహా నా పెళ్లంట’ పాటను తీసుకున్నారు.

ఈ పాటలో అనసూయ ఏకంగా మహానటి సావిత్రిని ఇమిటేట్‌ చేస్తూ చూపించారు. దాంతో జనాలకు మండిపోయింది. చక్కటి పాటను ఇలా అపహాస్యం చేస్తారా అని తిట్టిపోస్తున్నారు. కేవలం అనసూయనే కాక ఆ మాల్‌ యాజమాన్యాన్ని కూడా తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

కొందరైతే..డైరక్ట్ గా ‘మీరు సావిత్రి గారిని అవమానించారు’.. ‘అనసూయ.. సావిత్రి గారితో నీకు పోలికా’.. ‘దయ చేసి సావిత్రమ్మని ఇలాంటి పనులకు వాడకండి’.. అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ యాడ్‌లో ఘటోత్కచుడి పాత్రలో యస్వీఆర్‌ను ఇమిటేట్‌ చేస్తూ ప్రముఖ గాయకుడు మనో నటించారు.

గత కొద్ది రోజులుగా అనసూయ..జబర్దస్త్ షోలో కనపడటం లేదు. ఆమె స్థానంలో కొత్త యాంకర్ వర్షిణి వచ్చింది దాంతో ఆ లోటు టీఆర్పీలలో కనిపించిందో లేదో కానీ రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులు మాత్రం ఫీలయ్యారు. చాలా మంది సోషల్ మీడియాలో ఈ విషయం ప్రస్దావిస్తూ ఆమెపై మెసేజ్ లు ,కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇక వెబ్ మీడియా అయితే అనసూయ..ఇక జబర్దస్త్ కు బై చెప్పేసిందని టాక్ మొదలెట్టేసింది. ఈ టాపిక్ పై యూట్యూబ్ లో వచ్చే వీడియోల హెడ్డింగ్ ల గురించి మాట్లాడాల్సిన పనిలేదు. అయితే అనసూయ..వీటిన్నటికి సరైన రిప్లై ఇచ్చింది. తిరిగి షోలో కనిపించింది.