రూమర్స్ పై మీడియాకు అనసూయ ఫెరఫెక్ట్ రిప్లై

గత కొద్ది రోజులుగా అనసూయ..జబర్దస్త్ షోలో కనపడటం లేదు. ఆమె స్థానంలో కొత్త యాంకర్ వర్షిణి వచ్చింది దాంతో ఆ లోటు టీఆర్పీలలో కనిపించిందో లేదో కానీ రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులు మాత్రం ఫీలయ్యారు. చాలా మంది సోషల్ మీడియాలో ఈ విషయం ప్రస్దావిస్తూ ఆమెపై మెసేజ్ లు ,కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇక వెబ్ మీడియా అయితే అనసూయ..ఇక జబర్దస్త్ కు బై చెప్పేసిందని టాక్ మొదలెట్టేసింది. ఈ టాపిక్ పై యూట్యూబ్ లో వచ్చే వీడియోల హెడ్డింగ్ ల గురించి మాట్లాడాల్సిన పనిలేదు. అయితే అనసూయ..వీటిన్నటికి సరైన రిప్లై ఇచ్చింది.

అయితే అసలేం జరిగింది అంటే…

అనసూయ వరుసగా మూడు సినిమాలకు సైన్ చెయ్యడంతో ఆ షూటింగ్ లకి సంబందించిన డేట్స్ ను ముందుగానే నిర్మాతలు ఇచ్చింది కానీ కొన్ని కారణాలతో అవి కొంత డిస్ట్రబ్ అయ్యి ఎడ్జెస్ట్ చేయాల్సి వచ్చింది. దాంతో జబర్దస్త్ నిర్వాహకులకు ..ఆ రెండు వారాల షో కి తాను ఉండను అని, ముందుగానే చెప్పడంతోనే ఆ స్థానంలో వర్షినిని తీసుకున్నారు అని తెలిసింది.

దానికి తోడు ఎప్పటి కప్పుడు ‘జబర్దస్త్’ అప్డేట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసే అనసూయ వాటిని ప్రక్కన పెట్టేసింది. రూమర్స్ కు చెక్ చెప్పే ప్రయత్నం చేయేలుద. దాంతో అనసూయ జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేసిందంటూ వెబ్ మీడియా రెచ్చిపోయింది. అయితే వీటిన్నింటికీ చెక్ పెడుతూ.. మళ్లీ జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చేసింది అనసూయ.

తన రెగ్యలర్ స్క్రీన్ ఇమేజ్ కు మరింత హాట్ నెస్ గుప్పించి జబర్దస్త్ మేకోవర్ ఫొటోస్‌ను షేర్ చేసింది. దాంతో ‘ వరుస సినిమాల వల్ల షెడ్యూల్ బిజీగా ఉండటంతో జబర్దస్త్‌కి బ్రేక్ ఇచ్చా’ అంటూ హాట్ అనసూయ వివరణ ఇచ్చేసింది. మొత్తానికి సరైన టైమ్ లో సరైన రిప్లై ఇచ్చిందంటున్నారు ఆమె అభిమానులు.