యువ లిరిసిస్టుకి అలా కోటా పడింది!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూకస్వామ్యంపైనా.. మూక దాడులపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రధాని మోదీ ఇచ్చిన భరోసాతో హిందూ మూకలు చెలరేగిపోతూ దాడులకు పాల్పడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇందులో హిందూ- ముస్లిమ్ .. జైశ్రీరామ్ లాంటి టాపిక్స్ కూడా సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి. మూకదాడులపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమదైన శైలిలో గళమెత్తారు. జై శ్రీరామ్ పేరుతో యథేచ్ఛగా సాగిపోతున్న మూకదాడులను అరికట్టాలని కోరుతూ 49మంది సినీప్రముఖులు.. చరిత్ర కారులు మొన్న ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. `జై శ్రీరామ్` అనేది నేడు ఒక బెదిరింపు నినాదంగా మారిందని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. మతం పేరుతో సాగుతున్న ఈ మూక దాడులను అరికట్టాల్సిన బాధ్యత మోదీకి ఉందని కోరారు ఆ లేఖలో. అయితే వీళ్లందరినీ తూలనాడుతూ యువ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ చేసిన ఓ వ్యాఖ్యపై నెటిజనులు అంతే ఇదిగా స్పందించారు.
ఇంతకీ అనంత శ్రీరామ్ ఏమని రాశారు? అన్నది పరిశీలిస్తే.. వీళ్లందరినీ నకిలీ మేథావులు! అంటూ సెటైర్ వేశారు. `జై శ్రీరాం` అన్న పదం వల్ల ఎన్నో దారుణ మారణ కాండలు జరిగిపోతున్నాయ్. అంటే `జై` అన్న పదాన్ని , `శ్రీరాం` అన్న పదాన్ని నిఘంటువుల్లోనించి నిషేధించమంటారా? అంటూ సెటైరికల్ గా పంచ్ వేయాలని చూశారు. అయితే అట్నుంచి వచ్చిన స్పందన మాత్రం ఊహించలేనిదిగా ఉంది మరి!!
అనంత శ్రీరామ్ సుదీర్ఘమైన వ్యాఖ్యానం ఇదిగో ఇలా ఉంది.
నకిలీ మేథావులు మళ్ళీ సకిలించారు`

అది మరి మేధావి దెబ్బంటే
కుహనా లౌకికవాదులంతా కుమ్మక్కై

ప్రధాన మంత్రికి ఉత్తరం రాశారట అందులో

ఏముందయ్యా అంటే `జై శ్రీరాం` అన్న

పదం వల్ల ఎన్నో దారుణ మారణ కాండలు

జరిగిపోతున్నాయంట అందువల్ల ఆ పదం

వల్ల జరిగే దుష్పరిణామాలు ఆపాల్సిన

బాధ్యత ప్రధానమంత్రిదేనట . అంటే ఆ

మహాశయులు ఇప్పుడేమంటారు `జై` అన్న

పదాన్ని , `శ్రీరాం` అన్న పదాన్ని

నిఘంటువుల్లోనించి నిషేధించమంటారా?

ఏమో అన్నా అంటారు ..మేథావులుకదా..

వాళ్ళు అనేవారలు, మేము వినే వారలము

ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు చిక్కంతా వచ్చి

ఇప్పుడు క్రిష్ణా రామా అనుకుంటూ

శేష జీవితం ఆనందంగా గడుపుతున్న

తల్లిదండ్రులని వచ్చి చుట్టుకుంటుంది.

ఎందుకంటే నాపేరు `అనంత శ్రీరాం`

ఈ మేథావుల మేధస్సుని

అంచనా వెయ్యలేక

మాతల్లిదండ్రుల్లానే ఎంతోమంది

తమపిల్లల పేర్లలో రామశబ్ధాన్ని

ప్రయోగించారు

(సీతారాం ఏచూరి గారి నాన్నగారితో సహా ).

ఇప్పుడు వాళ్ళంతా మా జనన ధృవీకరణ

పత్రాలు మొదలుకుని ఆధార్ల వరకూ

మాపేర్లు మార్చే బృహత్తర బాధ్యతని

నెత్తినేసుకోవడం ఎలారా నాయనా అని

నెత్తీ , నోరు బాదుకోవలసిన పరిస్థితి

దీనికి జనాల స్పందన ఇలా ఉంది.. వారి మాటల్లోనే ఓసారి పరికిస్తే..
*మీ కళ్ళ జోడు మార్చి వారి అభ్యర్ధన చదవగలరు. ఎంత సేపటికి పాటలు వింటూ పాడుకుంటూ ఉంటాం కొంత ఆపేసి రోజు కొంత సమయం వార్తాపత్రికలు తిరగేస్తే అసలు విషయం బోధపడుద్ది. .
*మీరు నిజంగా మేధావి సోదరా, ముకదాడుల ని హత్యాలను అపాల్సిన బాధ్యత సర్కార్ ది కదా, వాటిని అపమన్నారు ఆ పెద్దలు దాన్ని మీరు రాముల వారి మీద డైవర్ట్ చేస్తారు బాగుంది యవ్వారం
*నీకు విషయం మీద పూర్తిగా అవగాహన లేదని అర్ధమవుతుంది… నువ్వు తప్పించి మిగతా వారు నకిలీ మేధావులని అహంభావం వద్దు. ఎన్నో వేల పాటలు రాసిన వేటూరి గారు కూడా ఇలా నోరు జార లేదు.
* జై శ్రీ రామ్, ఈ పోస్టు పెట్టే ముందు ఇక్కడ ఉన్న కొన్ని విదేశీ సానుభూతి పరులు ఉదారమైన కామెంట్స్ చేస్తారని అనంత శ్రీ రామ్ ఊహించే ఉంటారు. అటువంటి కామెంట్స్ ఆయన పోస్టు విలువను మరింత పెంచింది.
*ఎన్నో హత్యలకు ఎలాంటి పదాలు సాక్ష్యమో ఎవరికీ గుర్తులేదు కానీ ఇప్పుడు రామనామం తలచుకోగానే బుద్ధి వికసించింది. ప్రేమ పేరుతో ఎంతో మంది ఉసురు తీసుకున్ననపుడు పెగలని నోళ్లకు నాలుకొచ్చింది.
*ఒరయ్యా బుర్ర తక్కువ కన్నా కళ్ళజోడు మార్చి చదువు అలాగే లోకాన్ని చూడు అర్ధం అవుతుంది
ఒరోరీ యోగీ నన్ను నలిపేయ్రొయ్ పిసికేయేరొయ్ అని రాసుకునే వాడికి నీకు సమాజం బాధ ఎక్కడ అర్థమవుతుంది. ఎక్కువగా పిసుక్కోమాక.