Anantha Sreeram: అనంత శ్రీరామ్ ఒక్కో పాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

Anantha Sreeram: ఎన్నో అద్భుతమైన తెలుగు పదాలను ఎంతో అర్థవంతంగా పాటల రూపంలో రాస్తూ ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన రచయిత అనంత శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పాపులర్ తెలుగు సినీ గేయ రచయితలలో అనంత్ శ్రీరామ్ ఒకరు. ప్రతిభ ఉన్న రచయిత కావడంతో అనంత శ్రీరామ్ ఎక్కువగా తన పాటలో తెలుగు పదాలను ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే కొందరు ఈయనపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు.

అనంత శ్రీరామ్ కిఇంగ్లీష్ రాదని అందుకే ఎక్కువగా తెలుగు పదాలు ఉపయోగిస్తూ ఉంటారని ఆయనపై విమర్శలు చేశారు.సాధారణంగా ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు ఇలా మనకు ఎంతో మంది విమర్శలు చేయడం సర్వసాధారణం అయితే వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవడం ఎంతో ఉత్తమం అని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే అనంత శ్రీరామ్ రాసిన ఎన్నో పాటలు సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ దక్కించుకోవడమే కాకుండా మంచి గుర్తింపు పొందాయి.

తాజాగా ఆయన మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా కోసం రాసిన కళావతి సాంగ్ ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇలా వరుస హిట్ పాటలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంత శ్రీరామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన రెమ్యూనరేషన్ గురించి బయట పెట్టారు. తాను ఒక్కో పాటకు ఎంత తీసుకుంటారనే విషయం గురించి వెల్లడించారు. అనంత శ్రీరామ్ పెద్ద సినిమాలకు అయితే ఒక్కో పాటు రెండు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటానని చిన్న సినిమాలకు కాస్త తక్కువ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటానని వెల్లడించారు.ఇలా ఒక పాటకు రెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్ అంటే అనంత శ్రీరామ్ భారీ మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.