అమెజాన్ టీవీతో అమెరికా కోడ‌లు భారీ డీల్

గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌తో అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా జోనాస్ క‌ళ్లు తిరిగే డీల్ కుదుర్చుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. రెండేళ్ల కాలానికి కాంట్రాక్ట్ ఇది. మల్టీ మిలియన్ డాలర్ డీల్ ని `ఫ‌స్ట్ లుక్` డీల్ అని పిలుస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఫ‌స్ట్ లుక్ డీల్ అంటే ఒక క్రేజీ రైట‌ర్ కం డైరెక్ట‌ర్ తో నిర్మాత‌కు సంబంధించిన డీల్ అని భావించ‌వ‌చ్చు. అమెజాన్ టెలివిజన్ రూపొందించ‌నున్న టీవీ సిరీస్ ల‌కు సంబంధించిన డీల్ ఇది.

అమెజాన్ స్టూడియోస్ హెడ్ జెన్నిఫర్ సాల్కేతో ఒక సాధారణ సమావేశం అనంత‌రం `ఫస్ట్ లుక్` ఒప్పందానికి దారితీసిందని పీసీ తెలిపింది. ప్రియాంక.. నేను విభిన్న క‌థాంశాలు ఉన్న‌ గ్లోబల్ స్టోరీ టెల్లింగ్ పై అభిరుచిని కలిగి ఉన్నామ‌ని సల్కే అన్నారు. ఉత్తేజకరమైన కంటెంట్ .. ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించగల పాత్రల పట్ల పీసీ ఆకర్షితమ‌య్యారు. ఆమె పవర్ ‌హౌస్ నిర్మాత. త‌న‌కు అన్నివిధాలా స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.

“నా తపన నిజంగా ఆడవారికి సంబంధించిన‌ కథలను చెప్పడం… ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృష్టికర్తలతో కలిసి పనిచేయడం .. కథల‌లో వైవిధ్యంతో కొత్త‌ద‌నాన్ని సృష్టించడం` అని ప్రియాంక అన్నారు. ఇందుకు అమెజాన్ లాంటి గొప్ప భాగస్వామి ఏదీ లేద‌ని పీసీ అంది. హిందీ- ఇంగ్లీష్ భాష‌ల్లో గొప్ప టీవీ సిరీస్ ల సంగ‌మానికి ఆస్కారం ఉంటుంద‌ని వెల్ల‌డించింది.

ప్రస్తుతం, ప్రియాంక రెండు టెలివిజన్ ప్రాజెక్టులలో అమెజాన్‌తో కలిసి పనిచేస్తోంది. మొదటిది `సంగీత`, ఆమె భర్త, నిక్ జోనాస్‌తో కలిసి నిర్మించిన సిరీస్ ఇది. దీంతో పాటు `సిటాడెల్` అనే ప్రాజెక్టులోనూ న‌టిస్తోంది. ఆంథోనీ – జో రస్సో రూపొందిస్తున్న గూఢ‌చారి త‌ర‌హా సిరీస్ ఇది. దీనిలో ఆమె రిచర్డ్ మాడెన్‌తో కలిసి నటించనుంది.

“నేను టీవీ చూస్తున్నప్పుడు ఏదో తప్పిపోయినట్లు 13 ఏళ్ళ వయస్సులో నేను అనుకోలేదు. కానీ ఇప్పుడు నేను పెద్దదానిని అయ్యాక‌.. ప్ర‌తి దానికి భ‌య‌ప‌డుతున్నా. హైస్కూల్లో ఉన్న‌ప్పుడే చాలా నమ్మకంగా ఉండేదానిని అని నేను ఆశ్చర్యపోతున్నాను. నాకన్నా భిన్నంగా కనిపించే ప్రతి వ్యక్తికి భయపడ్డాను“ అంటూ పీసీ వెరైటీ.కామ్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించింది. 2015 లో సొంత‌ నిర్మాణ సంస్థ `పర్పుల్ పెబుల్ పిక్చర్స్`ను ప్రారంభించిన పీసీ.. “నేను తల దించుకుని హాలులో నడుస్తూ ఉండకపోతే అందరూ చూస్తున్న యునికార్న్ లాగా అనిపిస్తుంది“ అని పేర్కొంది.