తమిళ స్టార్ హీరోయిన్ అమలాపాల్ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. తెలుగు,తమిళ, మళయాళ ఇండస్ట్రీలు మాట్లాడుకునేలే చేసింది. ఆమె నగ్నంగా కనపడటం అనేది ఎవరు కూడా ఊహించలేదు. తోటి హీరోయిన్స్ ఎవరూ ఆ ధైర్యం చేయలేదు. ఏదో గ్లామర్ కోసం చిన్న చిన్న డ్రస్ ల్లో కనపడతారు కానీ ఇలా పూర్తి నగ్నత్వంతో కనపడరు. దాంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ”ఆడై” అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో కొద్ది పాటి డ్రస్ తో తో దర్శనమిచ్చిన అమలాపాల్.. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌లో పూర్తి బోల్డ్‌గా నటించింది.
తమిళ దర్శకుడు రత్నకుమార్ దర్శకత్వం వహించిన ‘ఆడై’ టీజర్‌లో ఆరంభంలో కూతురు కనిపించడంలేదని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం, ఒక సస్పెన్స్ వాతావరణంలో నెలకొంటుంది. అఖర్లో అమలాపాల్ ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా కనిపిస్తుంది.
ఇలాంటి పాత్రలో అమలాపాల్ నటించడంతో.. ఆమె డేరింగ్ అటెంప్ట్ చేయడాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ టీజర్ గురించి అమలా పాల్ ట్విటర్ ద్వారా స్పందించింది. ‘ఆడై సినిమా టీజర్‌ను కరణ్ జోహార్ విడుదల చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొంది.