రెండో వివాహం చేసుకోబోతున్న అమలాపాల్‌.. వరుడు ఎవరో తెలుసా?

అమల పాల్‌ దక్షిణాదిన బిజీగా వున్న నటీమణుల్లో ఒకరు, సాంఫీుక మాధ్యమంలో కూడా పోస్టులు పెడుతూ అభిమానులతో చాలా విషయాలు పంచుకుంటూ వుంటారు. తెలుగులో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ పక్కన నటించిన అమల పాల్‌ తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా పరిచయస్తురాలు. తెలుగులో రామ్‌ చరణ్‌ పక్కన నటించిన సినిమా ‘నాయక్‌’ అమలా పాల్‌ కి బ్రేక్‌ ఇచ్చింది.

తెలుగులో తరువాత కొన్ని సినిమాలే మాత్రమే చేశారు అమల పాల్‌. అలాగే ఒక వెబ్‌ సిరీస్‌ ‘కుడి ఎడమైనతే’ లో కూడా నటించారు ఆమె. దర్శకుడు ఎఎల్‌ విజయ్‌ ‘దైవ తిరుమగళ్‌’ అనే సినిమాలో, అనుష్క శెట్టితో పాటు అమల పాల్‌ని కూడా తీసుకున్నాడు. అప్పుడే దర్శకుడు విజయ్‌, అమల ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల తరువాత 2014, జూన్‌ 12న పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే రెండేళ్ల తరువాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విజయ్‌ తల్లిదండ్రులు, అమల పాల్‌ని సినిమాల్లో నటించవద్దు అని ఒక షరతు పెట్టడంతో, అమల అందుకు ఒప్పుకోకపోవటంతో 2017లో విడాకులు తీసుకోవటం జరిగింది అని అప్పట్లో అనుకున్నారు. అమల తరువాత వార్తల్లో ఉంటూ వస్తోంది. అప్పట్లో ఒక ఖరీదైన కారు కొన్నప్పుడు, పన్ను సరిగ్గా కట్టలేదని అమల పాల్‌ను అరెస్టు చేశారు అన్న వార్తలు బాగా వచ్చాయి. అందులో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ, ఆ తరువాత ఆ కేసును కొట్టేశారు కూడా.

అలాగే వేరే వేరే కారణాల వలన ఆమె వార్తల్లో ఉంటూ వస్తోంది. ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వుంది అమల. ఈసారి ఎందుకంటే తన రెండో వివాహం గురించి అమల పాల్‌ స్వయంగా తన సాంఫీుక మాధ్యమంలో షేర్‌ చేసింది. అయితే అబ్బాయి పేరు మాత్రం జె దేశాయ్‌ అని అర్థం అవుతోంది, కానీ అతను ఎప్పటి నుండి అమలకి తెలుసు, వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎప్పుడు మొదలైంది అనే విషయం మాత్రం తెలియదు అని అంటున్నారు.

అమల పాల్‌ పుట్టినరోజు సందర్భంగా ఒక పబ్‌ లో దేశాయ్‌, అమల పాల్‌కి ప్రపోజ్‌ చెయ్యగా ఆమె ‘ఎస్‌’ అని చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సాంఫీుక మాధ్యమంలో వైరల్‌ అవుతోంది. ఈ విషయాన్ని అమల, దేశాయ్‌ ఇద్దరూ తమ తమ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. అయితే వివాహం ఎప్పుడు జరగబోయేది ఇంకా తెలియలేదు, కానీ అమల పాల రెండో వివాహం దేశాయ్‌ అనే అబ్బాయితో మాత్రం జరగబోతోంది అని తెలుస్తోంది. అందరూ ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు, గూగుల్‌ చేస్తున్నారు.