మార్చి 31 న కిచ్చాసుదీప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ “హెబ్బులి”

ఎమ్‌ మోహన శివకుమార్‌ సమర్పణలో సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌ పతాకంపై కిచ్చసుదీప్‌, అమలాపాల్‌ జంటగా ఎస్‌కృష్ణ దర్శకత్వలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ “హెబ్బులి”. ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకోవడమే కాకుండా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 31 న గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్బంగా

చిత్ర నిర్మాత సి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది.కన్నడలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ.అందుకే తెలుగు లో విడుదల చేస్తున్నాను. ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఎ. కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించారు. సౌండ్‌ట్రాక్ మరియు ఫిల్మ్ స్కోర్‌ను అర్జున్ జన్య స్వరపరిచారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31 న గ్రాండ్ గా తెలుగులో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న మా “హెబ్బులి” సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీ నటులు : కిచ్చసుదీప్‌, అమలాపాల్‌, వి.రవిచంద్రన్‌, పి. రవిశంకర్, కబీర్ దుహన్ సింగ్ మరియు రవి కిషన్ తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ : ఎమ్‌ మోహన శివకుమార్‌
బ్యానర్ : సిఎమ్‌బి ప్రొడక్షన్స్‌
నిర్మాత : సి.సుబ్రహ్మణ్యం
దర్శకత్వం : ఎస్‌కృష్ణ
సినిమాటోగ్రఫీ : ఎ. కరుణాకర్
మ్యూజిక్ : అర్జున్ జన్య
పి. ఆర్. ఓ : హర్ష