అందినట్టే అంది మిస్సవుతోంది! అందుకేగా ఇలా సోలోగా?
ఆమె సాహసాలు నెవ్వర్ బిఫోర్ అంటే తప్పేమీ కాదు. కానీ ఆ సాహసం ఆమెకే తేడా కొడుతోంది. ఆమె వృత్తి పరంగా ఫుల్ రైజ్ లో ఉన్నప్పుడే వ్యక్తిగత జీవితం పేరుతో చేసిన ఓ ప్రయోగం ఏమైందో తెలిసిందే. ఆమెకు ఏదైనా ఇట్టే అందినట్టే అంది దూరమవుతోంది. వీరి వీరి గుమ్మడి పండు ఆమె పేరేమిటో చెప్పాల్సిన పనే లేదు. అసలు ఆ అందీ అందినట్టు అందనిదేమిటో కూడా చెప్పాల్సిన పనే లేదు. ఇంతకీ ఆమె ఎవరో చెప్పాలా? .. ఇంకెవరు..! ది గ్రేట్ ట్యాలెంటెడ్ స్టార్ అమలాపాల్.
డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్ తో బ్రేకప్ తర్వాత అమలాపాల్ సాహసాల గురించి ఇండస్ట్రీలో వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఆమె (ఆడై) లాంటి ప్రయోగాత్మక సినిమాలో నగ్నంగా నటించి సంచలనమే అయ్యింది అమలాపాల్. అసలు పాల్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ నేచుర్ గురించే యూత్ కొన్నాళ్లుగా ఆలోచలో పడిపోయారు. అసలు తన కెరీర్ ఆరంభమే మృగం (తమిళ అనువాద చిత్రం) ఒక సంచలనం. భార్యను కోల్పోయిన మామతో రొమాన్స్ చేసే కోడలి పిల్లగా అమలాపాల్ నటనను ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. వేడెక్కించే స్టింట్ లో తనకు తానే సాటి అన్నది అందరికీ తెలిసిన మ్యాటర్.
అదంతా సరే కానీ సోషల్ మీడియా యుగంలో తన ఇమేజ్ ఎక్కడా చెక్కు చెదరకుండా ఇతర స్టార్లకు ధీటుగా ఈ అమ్మడు వేస్తున్న ఈ ఫీట్ చూశారు కదా? అదిరిపోయే డెనిమ్ చినుగుల నిక్కరుతో టీనేజర్లనే కాదు ఆరు నుంచి 60వరకూ అందరినీ టెంప్ట్ చేస్తోంది. బిగి సడలని అందాల్ని రాశిగా పోసాను విందారగిస్తారా? అన్నట్టుగానే ఎలా ఫోజిచ్చిందో చూశారు కదా? అమలాపాల్ ఇన్ స్టా ఫోటోలు.. వీడియోలు ప్రస్తుతం యూత్ లో వైరల్ గా మారాయి. సంథింగ్ స్పెషల్ గా తెలుగు రాజ్యం పాఠక మహాశయుల కోసం..