“ఆమె “లో నగ్నంగా నటించిన అమలాపాల్ కేక పెట్టిస్తుంది
ఇప్పుడు “ఆడై ” చిత్రంతో అటు తమిళ ప్రేక్షకులను , “ఆమె “సినిమాతో తెలుగు ప్రేక్షకులను డ్రీముల్లోకి దించుతున్న బ్యూటిఫుల్ , బోల్డ్ స్టార్ అమలా పాల్ తాజాగా డీప్ ప్రేమలో ఉందట. “ఆమె” సినిమా లో అమలా పాల్ ఒకానొక సన్నివేశంలో నగ్నంగా నటించింది . దీనికి సంబందించిన టీజర్ ను కుర్రకారు విరగబడి చూస్తున్నారు .ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు . “ఆమె” సినిమా తెలుగు ,తమిళ భాషల్లో ఈనెల 19న విడుదల అవుతుంది . అయితే ఈ సినిమా ప్రచారంలో అనుకోకుండా అమలాపాల్ తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పేసింది .
27 ఏళ్ల అమలా పాల్ కు తెలుగు, తమిళ రంగాల్లో అభిమానులు వున్నారు . తమిళ సినిమా ” దైవ తిరు మగళ్ ” సినిమా షూటింగ్ జరిగేటప్పుడు మొదటిసారి ఆ చిత్రం దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడింది . 2014 సంవత్సరంలో ఇద్దరు వివాహం చేసుకున్నారు . కొన్నాళ్ళు హ్యాపీగా , జాలీగా గడిపారు . ఆ తరువాత నుంచే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి . సినిమా రంగంలో వున్నారు కాబట్టి ఇద్దరికీ మధ్య వున్న ఇగో పెరిగి పెద్దదయ్యింది . కలసి కాపురం చెయ్యలేం అనే నిర్ణయానికి వచ్చారు . 2016లో విడిపోయి వేరు కాపురాలు పెట్టేసుకున్నారు . 2017 లో ఇద్దరికీ విడాకులు వచ్చాయి .
అప్పటి నుంచి అమలా పాల్ జోడి కోసం చూస్తుంది . “ఆమె” సినిమా సమయంలో తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ప్రకటించింది . అయితే ఎవరు అనేది ఆమె వెల్లడించలేదు . బహుశ అతని అంగీకారంతోనే “ఆమె “సినిమా వప్పుకున్నట్టు తెలుస్తుంది . తెలుగు , తమిళ భాషల్లో ఇక కాలంలో విడుదలవుతున్న ఈ సినిమాకు దర్శకుడు రత్న కుమార్. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేస్తున్నాడు .