కోవిడ్ టెన్షన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? కాఫీ తాగాలా టీ తాగాలా? పసుపు ఉప్పు నీళ్లు తాగాలా? ఈ ప్రశ్నలకు ఇదిగో ఆన్సర్. ముద్దుగుమ్మ చెప్పిన ఈ టిప్ విన్నారా?
అందాల అమలాపాల్ ఏం చేసినా సంథింగ్ హాట్.. సంథింగ్ స్వీట్. ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాల్లో నచ్చినట్టు చెలరేగుతోంది. తనకు తోచిందే చేస్తూ వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ అంతకంతకు ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
తాజాగా అమలా రిలీజ్ చేసిన ఓ ఫోటో చూస్తుంటే .. ఈ భమ ప్రముఖ కాఫీ బ్రాండ్ తో భారీ డీల్ కుదుర్చుకుందనే అర్థమవుతోంది. కేఫ్ గోడలు.. కాఫీ వాఫ్టింగ్ .. తీపి వాసన .. అంటూ చాలానే పోయెట్రీ చెప్పింది అమలాపాల్. ఆ వాసను నేను పూర్తిగా మర్చిపోయాను అంటూ పద్యం పాడింది. నేటి మానసిక స్థితికి అద్భుతమైన కప్పు కాఫీ తాగండి అంటూ సెలవిచ్చింది. అంటే కోవిడ్ టెన్షన్ నుంచి బయటపడాలంటే కాఫీ తాగాలని చెబుతోందా?