నేను రేప్ చేసానా….నమ్ముతున్నారా?

హాలీవుడ్ లో మొదలైన మీటూ ప్రచారం ఇప్పుడు బాలీవుడ్ లో సెగలు రేపుతోంది. ఓ ప్రక్క సీనియర్ నటుడు నానా పటేకర్ ఈ మీటూ ఉద్యమంలో సమాధానం చెప్పుకోలేని సమిధగా మారారు. సీనియర్ బాలీవుడ్ నటి తను శ్రీ దత్తా ఆయనపై చేసిన ఆరోపణలు అంతటా సంచలనంగా మారాయి.

ఈమె మొదలెట్టిన ఈ మీటూ ఉద్యమాన్ని మరొకరు అందిపుచ్చుకుని కొనసాగిస్తున్నారు. ఆమె మరెవరో కాదు.. వెటరన్ టీవి నిర్మాత,  నిర్మాత, దర్శకురాలు వినితా నందా. ఆమె మరో సీనియర్ నటుడు అలోక్ నాధ్ తనను దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వేధించారంటూ వివాదానికి తెర తీసారు.

అలోక్ నాధ్ తనను వేధించటమే కాదు..రేప్ కూడా చేసారని ఆమె అన్నారు. మొదట ఆయన పేరు బయిటపెట్టకుండా సంస్కారీ పాత్రల నటుడు వేధించారని, ఆ విషయాన్ని తను బయటపెట్టే క్షణం కోసం ఇన్నాళ్లూ వెయిట్ చేసానని అన్నారు. ఆ తర్వాత ఆయన మరెవరో కాదు అలోక్ నాధ్ అంటూ రివీల్ చేసారు.

అయితే ఈ విషయమై అలోక్ నాధ్ కొట్టిపారేసారు. నేను రేప్ చేయటమేంటి ..అయితే ఆమెను వేరే ఎవరైనా రేప్ చేసి ఉండవచ్చు ..అతను ఆమెకు మంచి మిత్రుడు అంటోంది. చాలా పెద్ద మాటలు అంటోంది. ఈ సమయంలో ఇంతకు మించి వ్యాఖ్యానించ లేను అని తేల్చి చెప్పింది.