ఈరోజుల్లో సినిమా హీరోగా నటించడం చాలా కష్టం . ఎందుకంటే సినిమా అనేది ఖరీదైన వ్యవహారం . అందుకే సామాన్యులు దీనిలో ప్రవేశించలేక పోతున్నారు . ఇక సినిమా రంగంలో వున్న నిర్మాతలు, దర్శకులు, హీరోలు వారి పిల్లలను హీరోలుగా చేస్తున్నారు . రెండు మూడు సినిమాలు వరుసగా ఫ్లాఫ్ అయినా మళ్ళీ వారిని నిలబెట్టడానికే ప్రయత్నిస్తున్నారు .
సినిమారంగాలో ఉంటే వచ్చే డబ్బు, పేరు మరే రంగంలోనూ రాదు . ఇప్పుడు అల్లు అరవింద్ తన మూడవ కుమారుడు అల్లు శిరీష్ ను ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు . మొదటి కుమారుడు వెంకటేష్ వ్యాపారంలో స్థిరపడ్డాడు . రెండవ కుమారుడు అర్జున్ హీరోగా విజయవంతమైన హీరోగా వున్నాడు .మూడవ కుమారుడు శిరీష్ ను 2013లో గౌరవం సినిమాతో హీరోగా పరిచయం చేశాడు .
ఆ చిత్రం నిరాశ పరిచింది . ఆతరువాత శ్రీరస్తు శుభమస్తు , ఒక్క క్షణం చిత్రాలు కూడా శిరీష్ ను హీరోగా నిలబెట్టలేకపోయ్యాయి . ఇప్పుడు మలయాళంలో లో విజయవంతమైన సినిమాను తెలుగులో నిర్మిస్తున్నారు . ఈ సినిమా పేరు ఏ బి .సి .డి అంటే అమెరికన్ బోర్న్ కంఫ్యూజ్డెడ్ దేశీ . ఈ చిత్రంలో శిరీష్ ఓ భిన్నమైన పాత్రలో నటిస్తున్నాడట . సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . ఈ చిత్రమైనా శిరీష్ ను విజయ వంతమైన హీరోగా నిలబెడుతుందేమో చూడాలి .