అల్లు శిరీష్ కామెంట్ చాలా మందికి నచ్చేసింది

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడైన అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోవాలని చాలా కాలం నుంచి ట్రైల్స్ వేస్తున్నారు. అయినా వర్కవుట్ కావటం లేదు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ “ఏ బి సి డి” ఫెయిల్యూర్ పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.

https://twitter.com/AlluSirish/status/1134030241683263493

మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటం ఆయన్ని బాగా బాధించినట్లుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించిన శిరీష్ ప్రేక్షకుల తీర్పును గౌరవిస్తానన్నాడు. 

ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు శిరీష్‌. ‘మేమంతా మీకు మంచి సినిమా అందించేందుకు చాలా కష్టపడ్డాం. కానీ అంచనాలను అందుకోలేకపోయాం’ అంటూ ట్వీట్ చేశారు. ఫ్లాప్ సినిమాలకు కూడా సక్సెస్‌మీట్‌లు పెట్టి హడావిడి చేస్తున్న తరుణంలో శిరీష్‌ స్పందించిన తీరు హుందాగా ఉందంటున్నారు అభిమానులు.