సాయి పల్లవి పై అల్లు అర్జున్ మనసు పారేసుకున్నాడా ?

“ఫిదా “సినిమాతో సై పల్లవి కుర్రకారు మనసు దోచేసింది . ఎక్కడ చూసినా , విన్న ఫిదా పాటలే. ” పిల్లా రేణుకా .. పిలగాడొచ్చిండే ” పాట మారుమ్రోగి పోయింది . ఇక ఆ పాటలో సాయి పల్లవి చేసిన డాన్స్ కు మగపిల్లలు కిర్రెక్కిపోయారు . ఆడపిల్లలు ముగ్దులై పోయారు .

ఈ పాటను అల్లు అర్జున్ ఎన్నిసార్లు చూశాడో లెక్కలేదట . ఆ పాట అల్లు అర్జున్ కు అంత నచ్చేసిందట . అంతేనా ? ఇంకా వుంది మరి . సాయి పల్లవితో డాన్స్ చెయ్యాలనే కోరిక ఉందని చెప్పాడు అల్లు అర్జున్ . తనకి పెళ్లి అయ్యిందని , ఇద్దరు పిల్లలు ఉన్నారనే మాట మర్చిపొమ్మటున్నాడు , ఇప్పటికీ రొమాంటిక్ పాత్రల్లో నటిస్తానని హామీ ఇస్తున్నాడు .

ఇది “పడి పడి లేచే మనసు ” సినిమా కార్యక్రమంలో అల్లు అర్జున్ స్వయంగా చెప్పాడు . మరి ఈ లెక్కన అల్లు అర్జున తన సినిమాలో సాయి పల్లవిని పెట్టమని నిర్మాతలకు చెబుతాడేమో ?