అల్లు అర్జున్‌కు రూ.735 జరిమానా

మొన్న సంచలన దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ బుల్లెట్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌ చేయడంతో సైబరాబాద్‌ పోలీసులు జరిమానా విధించారు. ఈ ఘటనకు నాలుగు రోజుల ముందే మరో సినిమా స్టార్‌కు చెందిన క్యారవాన్‌కు జరిమానా విధించారు సైబరాబాద్‌ పోలీసులు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 16న సాయంత్రం 4:25కు హిమాయత్‌సాగర్‌ ప్రాంతంలో టీఎస్09ఎఫ్‌జీ 0666 నంబర్‌ గల క్యారవాన్‌ వెళ్తోంది. ట్రాఫిక్ జాం కావడంతో అటుగా వెళ్తున్న మహమ్మద్ అబ్దుల్ అనే వ్యక్తి వాహనాన్ని చూసి పూర్తిగా బ్లాక్ ఫిల్మ్ తో కప్పబడి ఉంది.ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కమిషనర్ కి ట్యాగ్ చేసాడు. అబ్దుల్ నుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ సీరియస్గా తీసుకొని చాలన్ విధించాడు. కేరళ వాహనం కార్వాన్ వాహనానికి బ్లాక్ ఫిల్మ్ వేసినందుకు గాను యజమానికి అల్లు అర్జున్ కి చాలన్ విధించారు శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు.