మీడియా ముందుకు అలీ…పవన్ గురించి..?

ఈ ఎలక్షన్స్ లో ఎక్కువ హాట్ టాపిక్ గా నడిచిన అంశం..అలీ, పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన వివాదం గురించే. ప్రచారంలో భాగంగా ఓ చోట పవన్ తన చిరకాల మిత్రుడు అలీ గురించి వ్యాఖ్యలు చేసారు. వాటికి అలీ ఆ వెంటనే కౌంటర్ ఇచ్చారు. పవన్ అభిమానులంతా ఈ విషయమై అలీని తప్పు పట్టారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యిపోయాయి. మళ్లీ పవన్, అలీ కలుస్తారా అనేది ప్రక్కన పెడితే..అసలు పవన్ కళ్యాణ్ ఓడిపోవటం గురించి అలీ ఏమంటారనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఆత్రుతగా ఉంది.

అయితే ఈ విషయం అలీ కు తెలుసు. అందుకే ఎలక్షన్స్ అయ్యాక…ఒక్కసారి కూడా మీడియా ని తన దగ్గరకు రానివ్వలేదు. తాను కూడా మీడియా ముందుకు రాలేదు. కానీ వైయస్ జగన్ ప్రమాణం స్వీకారం చేస్తున్న ఈ సమయంలో బయిటకు రాకపోతే ఇక బాగోదు అనుకున్నారో ఏమో కానీ … విజయవాడలో మీడియాని కలిసి మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు.

అలీ మాట్లాడుతూ.. పులివెందుల ముద్దు బిడ్డ, పులి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి ఆశయం ఇప్పటికి నెరవేరింది. గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన ఎదురు చూశారు. ఆ రోజు ఇప్పుడు వచ్చింది. ఈ సందర్భంగా మన కొత్త సీఎంకు స్వాగతం పలుకుతున్నట్లు అలీ తెలిపారు. నవరత్నాలు ఆల్ ది బెస్ట్ తాము కోరుకున్న నాయకుడు ముఖ్యమంత్రి అవుతుంటే చూసేందుకు ఎన్నో జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడకు రావడం జరిగింది. ఇంటికి నవ ధాన్యాలు ఎంత అవసరమో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కొత్త రాజధానికి ఈ నవరత్నాలు అంతే అవసరం. మొదటి సంతకం నవరత్నాల మీద పెడుతున్న ఆయనకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

సరే ఇదంతా రొటీన్ ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నా చెప్తాడా లేక మనమే అడుగుదామా అని మీడియా వాళ్లు ఉత్సాపడే లోగా అలీ మాయమైపోయారు. పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పార్టీ గురించి మాట్లాడి ఇంకా గాయాన్ని కెలికినట్లు అవుతుందని భావించినట్లున్నారు. సైలెంట్ అయ్యిపోయారు. ఇంతనా మంచి ప్రెండ్స్ కదా.