టీజర్ చూస్తూంటే చిరు‘చంటబ్బాయ్’గుర్తు వస్తోంది

అప్పట్లో చిరంజీవి, సుహాసిని కాంబినేషన్ లో రూపొందిన డిటెక్టివ్ కామెడీ చంటబ్బాయ్.ఇప్పటికి ఆ సినిమాలో సీన్స్ గుర్తు వచ్చినప్పుడుల్లా సినీ అభిమానులకు నవ్వు ఆగదు. ఇంతకాలం తర్వాత ఆ సినిమాని గుర్తు చేసేలా ఇప్పుడు ఓ చిత్రం రెడీ అయ్యంది.

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. చిత్రమైన కాన్సెప్ట్‌తో వ‌స్తున్న ఈ చిత్రాన్ని స్వ‌రూప్ ఆర్ఎస్‌జే తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఆ టీజర్ మీరు ఇక్కడ చూడవచ్చు.

Agent Sai Srinivasa Athreya Teaser | Naveen Polishetty | Shruti Sharma | Swaroop RSJ

ఇందులో న‌వీన్ లుక్ ఢిఫ‌రెంట్‌గా ఉండ‌గా, ఆయ‌న ప‌ర్‌ఫార్మెన్స్ న‌వ్వించేలా ఉంది. క్రైమ్‌ని ఐస్‌క్రీమ్‌లా నాకి ప‌డేస్తాం అనే డైలాగ్‌తో పాటు ప‌లు ఫన్నీ డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి.  ఒక సీన్ లో ఒకతను మా అబ్బాయిని వెతికి పట్టుకోవడానికి మంచి డిటెక్టీవ్ ని మీరే చూసి పెట్టండి అని అడగడం  తమాషాగా ఉంది. చివరిలో ఎఫ్బిఐ అని హీరో ఒకరిని బెదరించబోతే రివర్స్ లో అతను కత్తిని చూపించే సీన్ కూడా బాగా పేలింది.

నేచుర‌ల్ స్టార్ నాని చిత్ర టీజ‌ర్‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. ఈ సినిమా చంట‌బ్బాయిని గుర్తుకు తెస్తుంద‌ని అన్నాడు. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంద‌ని అన్నాడు.

మ‌ళ్ళీరావా సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన స్వధర్మ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ రెండో ప్రయత్రంగా ఈ సినిమాని నిర్మిస్తుంది. ‘అ!’ ఫేం మార్క్ కె రాబిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టేశారు