ప్లెజెంట్‌.. బ్రీజీ విజువ‌ల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న ‘ఆకాశం’ టీజర్

Akasam Teaser

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్ట‌ర్ అశోక్ సెల్వ‌న్ హీరోగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఆకాశం’. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన హీరో అశోక్ సెల్వ‌న్ లుక్ పోస్ట‌ర్స్‌, ముగ్గురు హీరోయిన్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. కాగా.. శుక్ర‌వారం సినిమా టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు. హీరోయిన్ వాయిస్‌తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. మ‌న‌సు ఉల్లాసంగా ఉన్న‌ప్పుడు మ‌ర‌చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తొస్తాయి క‌దూ అంటుంది. అశోక్ సెల్వ‌న్ డిఫ‌రెంట్ లుక్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్స్‌.. వారి మ‌ధ్య రిలేష‌న్‌ను అంద‌మైన స‌న్నివేశాల‌తో చూపించారు. లీలావ‌తి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ, గోపి సుంద‌ర్ సంగీతం ఈ స‌న్నివేశాల‌కు మ‌రింత అందాన్నిస్తున్నాయి. బ్యాగ్రౌండ్‌లో ఆకాశం అనే టైటిల్ పాట‌లాగా వినిపిస్తోంది.

ఆకాశం మంచి ప్రేమ క‌థా చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. దీంతో పాటు సినిమాలోని ఎమోష‌న్స్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుతున్నాయి. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.