దగ్గుబాటి హీరో టీజర్ ఆ రోజు వస్తుంది

దగ్గుబాటి ఫామిలీ నుండి వెంకటేష్, రానా తర్వాత ఇప్పుడు దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ హీరో గా ‘అహింస’ అనే సినిమాతో పరిచయమవుతున్నాడు. రానా కి ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తేజ ఈ సినిమాకు దర్శకుడు.

లవ్, యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై పి కిరణ్ నిర్మిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు. అలాగే చాలా గ్యాప్ తరువాత తేజ, ఆర్పీ పట్నాయక్ ల కాంబినేషన్ సెట్ అయ్యింది.

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా టీజర్ ని అక్టోబర్ 5 న విడుదల చేయనున్నట్లు క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.