“ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమా ప్రారంభం!

“మళ్ళీరావా” సినిమా తరువాత నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న రెండో చిత్రానికి “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. మళ్ళీరావా దర్శకులు గౌతమ్ తిన్ననూరి తొలి షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేసారు చిత్ర యూనిట్.  థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించబడుతున్న ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

స్వరూప్ ఆర్.ఎస్.జే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్  ప్రారంభం కానుంది. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతోందని నిర్మాత రాహుల్ దేవ్ నక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్క్ క్రోబిన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

 

నటీనటులు:

నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ

 

సాంకేతిక నిపుణులు:

కథ, దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జే

స్క్రీన్ ప్లే: స్వరూప్ ఆర్.ఎస్.జే & నవీన్ పొలిశెట్టి

మ్యూజిక్: మార్క్ క్రోబిన్

కెమెరామెన్: సన్నీ కురపాటి

ఎడిటర్/కో డైరెక్టర్: అమిత్ తిరుపతి

ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం

కాస్టూమ్ డిజైనర్: మౌనిక యాదవ్, వనజా యాదవ్

ప్రొడక్షన్ మేనేజర్: శ్రీహరి పదమల్లు

పి.ఆర్.ఓ: వంశీశేఖర్